కేసీఆర్ పాలన చూసే టీఆర్ఎస్‌లో చేరా : నామా

  • Published By: madhu ,Published On : March 21, 2019 / 08:55 AM IST
కేసీఆర్ పాలన చూసే టీఆర్ఎస్‌లో చేరా : నామా

Updated On : March 21, 2019 / 8:55 AM IST

తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, కేసీఆర్ పాలన చూసి TRSలో జాయిన్ అయినట్లు నామా నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మొదటి వేసిన ఓటు వేసినట్లు చెప్పారు. రాష్ట్రం, ప్రజలకు, ప్రధానంగా ఖమ్మం జిల్లా ప్రజలకు అన్ని విధాల మేలు చేకూర్చేలా పని చేస్తానన్నారు నామా. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. 
Read Also : ఎన్నికల్లో గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం

ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాం రాం చెప్పిన నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మార్చి 21వ తేదీ గురువారం TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో నామా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ…తాగునీరు, సాగునీరు, సంక్షేమ పథకాలు అమలు కావాలని తాను కలలు కనడం జరిగిందన్నారు. ఐదేళ్లుగా కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.  రాబోయే టైంలో నాయకుడిగా అండగా..ఆయన ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తనన్నారు నామా. 

ఇదిలా ఉంటే TRS ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా పేరు దాదాపు ఖరారైందని ఈ చేరికతో తెలిసిపోయింది. సాయంత్రం 4గంటల సమయంలో గులాబీ బాస్ కేసీఆర్ ఎంపీ అభ్యర్థుల జాబితా రిలీజ్ ఛాన్స్ ఉంది.