ఉరివేసుకొని నవ వధువు ఆత్మహత్య
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…లాలాగూడ పీఎస్ పరిధిలో రైల్వే ఉద్యోగం చేస్తున్న వెంకటేశ్‌కు ఆలేర్‌కు చెందిన మమత(20)తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది.
అనంతరం స్థానిక రామమందీర్ సమీపంలోని రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన మమత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.