తెలంగాణలో సా.7 తర్వాత బయట తిరగడం నిషేధం, సా.7 నుంచి ఉ.6 వరకు అన్ని షాపులు బంద్
కరోనా వ్యాప్తి కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. కొత్త

కరోనా వ్యాప్తి కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. కొత్త
కరోనా వ్యాప్తి కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం సాయంత్రం 7 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయట తిరగడానికి వీల్లేదు. అత్యవసర మందులకు తప్ప సాయంత్రం 7 తర్వాత బయట తిరగడం నిషేధం. అంతేకాదు సా. 7 నుంచి ఉ.6 వరకు అన్ని షాపులు బంద్ చేయాల్సిందే. నిత్యవసర వస్తువుల కొనుగోలుకు కూడా అనుమతి నిరాకరించారు.
సాయంత్రం 7 తర్వాత ఉండేవి ఆసుపత్రులు, మెడికల్ షాపలు మాత్రమే:
సాయంత్రం 7 తర్వాత ఉండేవి ఆసుపత్రులు, మెడికల్ షాపలు మాత్రమే. అంతేకాదు ప్రజలు తాము నివాసం ఉంటున్న ఇళ్లకు 3 కిలోమీటర్ల పరిధిలోనే సరుకులు కొనాలనే నిబంధన విధించారు. లాక్ డౌన్ ఆదేశాల అమలుకు ప్రభుత్వం చెక్ పోస్టులు ఏర్పాటు చేయనుంది. నిత్యవసరాల ధరల నియంత్రణకు ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది.
లాక్ డౌన్ ఆదేశాలు లెక్కచేయని ప్రజలు:
లాక్ డౌన్ ఆదేశాలు ఉన్నా ప్రజలు లెక్క చేయడం లేదు. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకు రావడంతో అధికారులు ఆందోళన చెందారు. వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని భయపడ్డారు. దీంతో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను మరింత స్ట్రిక్ట్ చేసింది.
తెలంగాణలో 33కి చేరిన కరోనా కేసులు:
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సోమవారం(మార్చి 23,2020) ఒక్క రోజే 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 33కి చేరింది. మంత్రి ఈటల రాజేందర్ ఈ విషయాన్ని తెలిపారు. బాధితులకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒక్కరు కూడా వెంటిలేటర్ పై లేరని మంత్రి ఈటల తెలిపారు. 97 అనుమానిత కేసులు ఉన్నాయన్న మంత్రి, రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఒక్కరు కూడా కరోనాతో చనిపోలేదని మంత్రి వెల్లడించారు.
బతికుంటే బలుసాకు తినొచ్చు:
బతికుంటే బలుసాకు తినొచ్చన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ లాక్ డౌన్ కు పిలుపునిచ్చారని మంత్రి ఈటల చెప్పారు. మార్చి 31 వరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, వైరస్ బారి నుంచి కాపాడుకోవాలన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు గుంపులుగా రాకుండా ఇంటికొకరు చొప్పున నిత్యవసరాల కోసం బయటకు రావాలని మంత్రి కోరారు.