అకాల విపత్తు : హైదరాబాద్ లో 230 చెట్లు కూలిపోయాయి

  • Published By: veegamteam ,Published On : April 24, 2019 / 05:24 AM IST
అకాల విపత్తు : హైదరాబాద్ లో 230 చెట్లు కూలిపోయాయి

Updated On : April 24, 2019 / 5:24 AM IST

తెలంగాణలో మండు వేసవిలో కురిసిన అకాల వర్షాలకు పంటలకు అపార నష్టం ఏర్పడింది..కానీ హైదరాబాద్ నగరంలో పంట పొలాలు లేకున్నా.. పచ్చదానానికి మాత్రం అపార నష్టం జరిగింది. 

వర్షంతో పాటు ఈదురుగాలులు వీయటంతో హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లో 637 చెట్లకు నష్టం జరిగింది. వాటిలో కొన్ని కూలిపోయాయి. గాలలు తాకిడికి పెద్ద పెద్ద చెట్లు సైతం వేళ్లతో సహా పెకలించివేయబడ్డాయి. కూలిన చెట్లలో ఎక్కువశాతం గుల్‌మొహర్ వంటి మాములు చెట్లే అయినప్పటికీ చాలాచోట్ల రావిచెట్లు కూలిపోయాయి. 
కూలిపోయిన 230 చెట్లలో 185 మంది పూర్తిగా చనిపోయాయి. 

కొన్ని చెట్లను వేరే ప్రాంతానికి తరలించి వాటిని తిరిగి నాటేందుకు యత్నిస్తున్నట్లు ప్రకటించింది GMHC. 407 చెట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, 326 తీవ్ర నష్టం వాటిల్లినట్లు లెక్కలు చెబుతున్నాయి. కూలిపోయిన చెట్లను GHMC డిసాస్టర్ స్పందన ఫోర్స్ సహకారంతో..బయోడైవర్శిటీ కేంద్రానికి తరలించామని జీవవైవిధ్యం అదనపు కమిషనర్ వి కృష్ణ తెలిపారు. 
 

హైదరాబాద్  కూలిన చెట్లు  కొమ్మలు కూలిన చెట్లు 
ఎల్బీ నగర్  62 34
చార్మినార్  48 97
ఖైరతాబాద్  43 41
శేరిలింగంపల్లి  7 0
కుకట్ పల్లి 9 9
సికింద్రాబాద్  71 226