సకల జనుల సామూహిక దీక్షకు అనుమతి నిరాకరణ
ఆర్టీసీ జేఏసీ నేతలు రేపు తలపెట్టిన సకల జనుల సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సామూహిక దీక్షకు అనుమతి ఇవ్వలేమని సీపీ అంజనీకుమార్ ఖరాఖండిగా చెప్పారు.

ఆర్టీసీ జేఏసీ నేతలు రేపు తలపెట్టిన సకల జనుల సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సామూహిక దీక్షకు అనుమతి ఇవ్వలేమని సీపీ అంజనీకుమార్ ఖరాఖండిగా చెప్పారు.
ఆర్టీసీ జేఏసీ నేతలు శనివారం (నవంబర్ 9, 2019) తలపెట్టిన సకల జనుల సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సామూహిక దీక్షకు అనుమతి ఇవ్వలేమని సీపీ అంజనీకుమార్ ఖరాఖండిగా చెప్పారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్యాంక్ బండ్ వైపు ఎవరొచ్చినా అరెస్టు చేస్తామన్నారు.
అఖిల పక్ష నేతలు కోదండరామ్, ఎల్.రమణ, తమ్మినేని వీరభద్రం, చాడా వెంకట్ రెడ్డి, నారాయణ నేతృత్వంలోని కొందరు అఖిలపక్ష నేతలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిసి
అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే సామూహిక దీక్షకు సీపీ అనుమతి నిరాకరించారు. రేపు ఎవరైనా ట్యాంక్ బండ్ వచ్చినా, చట్టాన్ని తమ చేతిలోకి తీసుకేంటే వారందరినీ అదపులోకి తీసుకుంటామన్నారు. కచ్చితంగా అరెస్టు ఉంటాయని చెప్పి సూచనప్రాయంగా చెప్పారు. ద
దీనికి సంబంధించి కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం అవుతుంది. నేటితో ఆర్టీసీ సమ్మె 35వ రోజుకు చేరుకుంది. రేపు సామూహిక దీక్షలకు ట్యాంక్ బండ్ కు రావాలని అఖిల పక్ష నేతలు పిలుపు ఇచ్చిన క్రమంలో దానికి పర్మీషన్ కోసం శుక్రవారం (నవంబర్ 8, 2019) బషీర్ బాగ్ లోని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను అఖిల పక్ష నేతలు కలిశారు. అయితే దీక్షకు అనుమతి లేదని సీపీ వారికి స్పష్టంగా చెప్పారు.
ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. అయితే ఇవి అక్రమ అరెస్ట్‌లని .. జేఏసీ నేతలు ఖండిస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు వంద మంది కార్మికులను అరెస్ట్ చేశారని జేఏసీ నేతలు మండిపడుతున్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఛలో ట్యాంక్‌బండ్‌ను సకల జనుల సామూహిక దీక్షగా మార్చారు. దీంతో రేపటి కార్యాచరణ.. భవిష్యత్ వ్యూహంపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు ఆల్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ రాత్రిలోగా కార్మికులు హైదరాబాద్‌కు చేరుకోవాలని ఆర్టీసీ జేఏసీ నేతలు పిలుపునిస్తున్నారు. పోలీసులు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సకల జనుల సామూహిక దీక్ష చేసి తీరుతామని చెప్పారు.
మానవహారాలు, భిక్షాటనలు, అర్ధనగ్న ప్రదర్శనలతో ఆర్టీసీ కార్మికులు హోరెత్తిస్తున్నారు. నిరసనలు, ఆందోళనలతో సమ్మెబాటలోనే కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి విడనాడి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.