హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత, లైంగిక సామర్థ్యం పెరుగుతుందంటూ విక్రయాలు

hyderabad drugs: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. లైంగిక సామర్థ్యం పెరుగుతుందంటూ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. 200 గ్రామలు మత్తుమందు మెఫిడ్రిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. పబ్బుల్లో పరిచయాలు పెంచుకుని డ్రగ్స్ సరఫరా చేస్తోంది ముఠా. పబ్ లకు వచ్చే వాళ్లే టార్గెట్ గా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రముఖ హోటల్ లో పని చేసిన చెఫ్ సలీమ్ ఈ డ్రగ్స్ ముఠాకు సూత్రధారిగా పోలీసులు తెలిపారు.