పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి
హైదరాబాద్ లో దారుణం జరిగింది. పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.

హైదరాబాద్ లో దారుణం జరిగింది. పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. కర్మన్ ఘాట్ లోని శుభోదయ కాలనీకి చెందిన చందర్ రావు అనే వ్యక్తి గురువారం (అక్టోబర్ 17, 2019) ఉప్పల్ లో రోడ్డు దాటుతుండగా ఉప్పల్ పోలీసు పెట్రోలింగ్ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.
చికిత్సి కోసం అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం (అక్టోబర్ 18, 2019) ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. చందర్ రావు మృతితో అతని కుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. కర్మన్ ఘాట్ శుభోదయ కాలనీలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.