నిజామాబాద్ లో ఈవీఎంల ద్వారానే పోలింగ్ : ఉమేష్ సిన్హా
నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలకు ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులు ఉమేష్ సిన్హా తెలిపారు.

నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలకు ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులు ఉమేష్ సిన్హా తెలిపారు.
హైదరాబాద్ : నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలకు ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులు ఉమేష్ సిన్హా తెలిపారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఏప్రిల్ 2 మంగళవారం తెలంగాణ సీఎస్ ఎస్ కే జోషిని ఆయన కలిశారు. అనంతరం ఉమేష్ సిన్హా మీడియాతో మాట్లాడారు. ఈవీఎం, వీవీప్యాట్లపై అధికారులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. బెల్, ఈసీఐ అధికారులతో చర్చించామని తెలిపారు. కొత్త ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తామన్నారు.
మొత్తం 185 మంది పోటీలో ఉండటంతో… ఎన్నిక నిర్వహణ కోసం ఎన్ని అవకాశాలున్నాయో అన్నింటిపైనా ఈసీ కసరత్తు చేసింది. ఒకానొక సమయంలో బ్యాలెట్ పేపర్‌తో ఎన్నిక నిర్వహించేందుకు సిద్ధమైంది. కానీ చివరకు జంబో ఈవీఎంలకే జై కొట్టింది. M-3 రకం ఈవీఎంలు వాడాలని ఈసీ నిర్ణయించింది. వీటిని బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL, హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL సంయుక్తంగా తయారుచేశాయి. 384 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా సరే.. ఓటింగ్ నిర్వహించడం చాలా ఈజీ.