ఛానళ్లపై పూనంకౌర్ కంప్లయింట్ : వాళ్లను వదలొద్దు.. చర్యలు తీసుకోండి

  • Published By: madhu ,Published On : April 16, 2019 / 01:14 PM IST
ఛానళ్లపై పూనంకౌర్ కంప్లయింట్ : వాళ్లను వదలొద్దు.. చర్యలు తీసుకోండి

Updated On : April 16, 2019 / 1:14 PM IST

యూ ట్యూబ్ ఛానల్స్‌పై కంప్లయింట్ చేశారు పూనమ్ కౌర్. వాళ్లను వదలొద్దని..చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు ఆమె. కొన్ని రోజులుగా యూ ట్యూబ్‌లో తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం హైదరాబాద్ సైబర్ క్రైం కార్యాలయానికి ఆమె వచ్చారు. 
Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్

తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు..చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అభ్యంతకరమైన వ్యాఖ్యలతో గుర్తు తెలియని కొందరు తనను వేధిస్తున్నారని, ఇదంతా ఉద్దేశపూర్వకంగానే పోస్టులు పోస్టింగ్ చేస్తున్నారని మండిపడ్డారు ఆమె.

యూ ట్యూబ్‌లో ఇలా చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులను పోలీసులు గుర్తించి చర్యలు తీసుకుంటారనే నమ్మకం వ్యక్తం చేశారు ఆమె. తనకు జరిగినట్టు వేరే అమ్మాయికి జరగకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. నిందితులెవరైనా వారికి శిక్షపడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు పూనమ్. పూనమ్ కౌర్…SV కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మాయాజాలం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ భామ. కొన్ని చిత్రాల్లో హీరోయిన్లుగా నటించిన ఈమె..సైడ్ క్యారెక్టర్స్ చేశారు. 
Read Also : ఇక పోదాం పదండీ : చంద్రుడిపై నీళ్లు ఉన్నాయి