విద్యాదాన్ : జైళ్లలో అక్షర వెలుగులు
క్షణికావేశంలో చేసిన నేరాలకు కారాగారంలో మగ్గిపోతున్న శిక్ష అనుభవిస్తున్న ఖైదీల జీవితాల్లో అక్షరాలు వెలుగులను పంచుతున్నాయి. ఒకప్పుడు కత్తులు పట్టిన చేతులు ఇప్పుడు పలకాబలపం పట్టాయి. క్షణికావేశంలో నేరాలు చేసి వచ్చిన ఖైదీలు జైలు బడిలో అక్షరాలు దిద్దుతున్నారు.

క్షణికావేశంలో చేసిన నేరాలకు కారాగారంలో మగ్గిపోతున్న శిక్ష అనుభవిస్తున్న ఖైదీల జీవితాల్లో అక్షరాలు వెలుగులను పంచుతున్నాయి. ఒకప్పుడు కత్తులు పట్టిన చేతులు ఇప్పుడు పలకాబలపం పట్టాయి. క్షణికావేశంలో నేరాలు చేసి వచ్చిన ఖైదీలు జైలు బడిలో అక్షరాలు దిద్దుతున్నారు.
హైదరాబాద్ : క్షణికావేశంలో నేరాలు
జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు
కత్తులు పట్టిన చేత్తో పలకాల బలపాలు
ఖైదీల జీవితాల్లో అక్షరాల వెలుగులు
ఖైదీలకు విద్య నేర్పేందుకు జైళ్ల విద్యాదాన్ యోజన
డిగ్రీ, పీజీ సర్టిఫికెట్స్ తో బైటకొస్తున్న ఖైదీలు
నాలుగేళ్లలో 1,13,909 మంది నిరక్ష్యరాస్యులైన ఖైదీలు
30 జైళ్లలో విద్యాదాన్ యోజన
ఖైదీల కోసం స్కూల్స్ అండ్ లైబ్రరీ
క్షణికావేశంలో చేసిన నేరాలకు కారాగారంలో మగ్గిపోతున్న శిక్ష అనుభవిస్తున్న ఖైదీల జీవితాల్లో అక్షరాలు వెలుగులను పంచుతున్నాయి. ఒకప్పుడు కత్తులు పట్టిన చేతులు ఇప్పుడు పలకాబలపం పట్టాయి. క్షణికావేశంలో నేరాలు చేసి వచ్చిన ఖైదీలు జైలు బడిలో అక్షరాలు దిద్దుతున్నారు. అక్షరం ముక్క రాని వారు సైతం సంతకం పెట్టేస్తున్నారు..పేపర్ని అనర్గళంగా చదివేస్తున్నారు. అంతేకాదు కొద్దో గొప్పో చదువుకున్నవారు జైలు నుండి డిగ్రీ, పీజీ పట్టాలు పట్టుకుని బయటకొస్తున్నారు.
2014 జూలై 11న ప్రారంభమైన విద్యాదాన్ యోజన
2014 జూలై 11న జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్ విద్యాదాన్ యోజన కార్యక్రమంతో జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న నిరక్ష్యరాస్యులైన ఖైదీలను అక్షరాస్యులుగా తయారవుతున్నారు. సెంట్రల్ జైల్ తో సహా 30 జైళ్లలో విద్యాదాన్ యోజన మొదలైంది. ఈ నాలుగేళ్లలో 1,13,909 మంది నిరక్ష్యరాస్యులైన ఖైదీలు అక్షరాస్యులుగా మారారు. ఒక్క చంచల్‌గూడ జైల్లోనే ఈ నాలుగేళ్లలో 16 వేలకు పైగా ఖైదీలను అక్షరాస్యులుగా మారారు. అంతేకాదు చదువుకున్న ఖైదీలకు వయోజన విద్యశాఖ ద్వారా జైలులోనే టీచర్ ట్రైనింగ్ ఇప్పిస్తూ తోటి ఖైదీలకు టీచింగ్ ఇప్పిస్తున్నారు.
స్కూల్ తో పాటు లైబ్రరీ
ప్రతీ 30 మంది ఖైదీలకు ఒక క్లాస్ రూమ్..ఏర్పాటు చేసి ఉదయం 9 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 1 నుంచి 3.30 గంటల వరకు ఉర్దూ, హిందీ, తెలుగు భాషల్లో చదువు చెబుతున్నారు. తరువాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు జైల్లోనే ఓ గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసి వ్యక్తిత్వ వికాసం, ప్రముఖుల ఆటోబయోగ్రఫీలు వంటి పలు పుస్తకాలను చదివించట ద్వారా వారిలో పరివర్తన తెచ్చేందుకు జైళ్ల శాఖ చర్యలు తీసుకుంటోంది. బైట ప్రపంచలో జరుగుతున్న సమాచారంకోసం అన్ని రకాల డైలీ పేపర్స్ వంటి సమాచారం కూడా అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో పలువురు ఖైదీలు అక్షరాస్యులుగా మారటమే కాక..వారి వారి జీవితాలను సరికొత్త బాటలో నడిపించుకునేందుకు జైళ్ల శాఖ ఏర్పాటు చేసిన ఈ విద్యాదాన్ యోజన ఎంతగానో ఉపయోగపడుతోంది.
ఖైదీలంటే కరుడు కట్టిన కఠినాత్ములే కాదు..జైలు అంటే కఠినంగా ఉంటాయనే పాతకాలపు నిబంధలనకు స్వస్తి చెప్పి ఖైదీలలోను..వారి జీవితాలలోను వెలుగులను నింపుతున్నాయి జైళ్ల శాఖ తీసుకున్న నిర్ణయాలు. ఖైదీలంటే దుర్మార్గులు కాదనీ..జైలు కెళ్లినప్పటికీ శిక్షాకాలం పూర్తి చేసుకుని తిరిగి బైటకు వచ్చే సమయానికి వారిలో విద్య, వివేకం, విచక్షణ నేర్పే విద్యాలయాలుగా జైళ్లు పనిచేస్తున్న తీరు అభినందనీయం..