Bharat Jodo Yatra: హైదరాబాద్‌లో భారత్ జోడో యాత్ర.. నృత్యం చేస్తూ అమ్మాయి స్వాగతం.. వీడియో వైరల్
కాంగ్రెస్ నేత రహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం హైదరాబాద్ లోని బహదూర్ గూడలో కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ఆయన శంషాబాద్ నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. హైదరాబాద్ లో రాహుల్ పాదయాత్ర సందర్భంగా ఆయనకు ఓ అమ్మాయి నృత్యం చేస్తూ స్వాగతం పలికింది. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కాగా, ఇవాళ సాయంత్రం పురానాపూల్ నుంచి చార్మినార్.. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్‌కు పాదయాత్ర ఉంటుంది.

Bharat Jodo Yatra
Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం హైదరాబాద్ లోని బహదూర్ గూడలో కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ఆయన శంషాబాద్ నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. హైదరాబాద్ లో రాహుల్ పాదయాత్ర సందర్భంగా ఆయనకు ఓ అమ్మాయి నృత్యం చేస్తూ స్వాగతం పలికింది. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
కాగా, ఇవాళ సాయంత్రం పురానాపూల్ నుంచి చార్మినార్.. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్‌కు పాదయాత్ర ఉంటుంది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక స్తంభాన్ని ఆయన సందర్శిస్తారు. ఈ యాత్రలో జైరాం రమేశ్ కూడా పాల్గొంటున్నారు. ఇవాళ సాయంత్రం భారత్ జోడో యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొంటారు. ఇవాళ రాత్రి 7గంటలకు నెక్లెస్ రోడ్‌లో కార్నర్ సమావేశం ఉంటుంది. ఇవాళ సాయంత్రం రాహుల్ ప్రసంగిస్తారు.
ఆ తర్వాత బోయిన్ పల్లిలో రాహుల్ గాంధీ బస చేస్తారు. రాహుల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 1,000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. నిన్న జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని భద్రతను పెంచారు. పాలమాకులలో ఓ దుండగుడు భద్రతా వలయాన్ని ఛేదించుకొని రాహుల్ గాంధీ వద్దకు వచ్చాడు. సీఆర్పీఎఫ్ బలగాలు అతడిని బయటకు పంపాయి.
Another beautiful start to our fight for justice.#BharatJodoYatra pic.twitter.com/LHJnKSvYVH
— Congress (@INCIndia) November 1, 2022
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..