బీ అలర్ట్ : తెలంగాణలో రేపు వడగండ్ల వాన

  • Published By: madhu ,Published On : February 14, 2019 / 12:30 AM IST
బీ అలర్ట్ : తెలంగాణలో రేపు వడగండ్ల వాన

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చలికాలంలో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం అక్కడక్కడా ఒక మాదిరి వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. పాక్ వైపు, తూర్పు భారత రాష్ట్రాల వైపు అల్పపీడనంతో కూడిన గాలులు వీస్తున్నాయి.

 

దీని ఫలితంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని వెల్లడించారు. కొన్ని చోట్ల క్యుములోనింబస్ మేఘాలేర్పడి వర్షం పడే సూచనలున్నాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు పడే సూచనలున్నాయన్నారు. రైతులు ముందజాగ్రత్తలు తీసుకోవాలని కోరారు వాతావరణశాఖ అధికారులు. వడగండ్ల వానతో ఆరుబయట ఉన్న పంటలు దెబ్బతినే అవకాశం ఉందని.. మార్కెట్ యార్డుల్లోని పంటకు కవర్లు కప్పుకోవాలని సూచించారు. అప్పటికప్పుడు వాతావరణంలో మార్పులతో వడగండ్ల పడనున్నట్లు వెల్లడించారు.