Rains in Telangana: తెలంగాణలో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలోని పలు జిల్లాలో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలపడి ఇవాళ పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అన్నారు.

Rains in Telangana: తెలంగాణలో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం

Rains in Telangana

Updated On : August 19, 2022 / 11:18 AM IST

Rains in Telangana: తెలంగాణలోని పలు జిల్లాలో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలపడి ఇవాళ పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అన్నారు. ఇటీవ‌ల తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డ విష‌యం తెలిసిందే. అనంతరం వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఇప్పుడు మ‌ళ్ళీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెప్పారు.

Janmashtami: లండన్‌లో భార్యతో కలిసి గుడికి వెళ్ళిన రిషి సునక్.. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నానని ట్వీట్