సైదాబాద్ లో రోడ్డు యాక్సిడెంట్ : పంజాగుట్ట ఎస్సైకి గాయాలు

హైదరాబాద్ సిటీ చాదర్ ఘాట్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పని చేస్తున్న శ్రీనివాసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కారు వేగంగా వచ్చి రోడ్డు పక్కనే ఉన్న స్తంభానికి ఢీ కొట్టింది. యాక్సిడెంట్ అయిన కారు సడన్ గా రోడ్డు మధ్యకు వచ్చింది. కారు వెనకే బైక్ పై వెళ్తున్న ఎస్ఐ శ్రీనివాసు కారును ఢీకొట్టారు. ఎగిరి పడ్డారు. తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే దగ్గరలో ఉన్న మలక్ పేట్ యశోదా హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. ఈ యాడ్సిడెంట్ మెరిడియన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా జరిగింది.
2019, అక్టోబర్ 19వ తేదీ ఉదయం పంజాగుట్ట ఎస్సై శ్రీనివాస్ బైక్ పై సైదాబాద్ నుంచి పంజాగుట్టకు చాదర్ ఘాట్ మీదుగా వస్తున్నారు. అదే సమయంలో MH01 AC 1342.. SHIFT కారు స్తంభాన్ని ఢీ కొట్టింది. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
యాక్సిడెంట్ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కారు వేగంగా కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టటం.. ఆ వెంటనే అదుపు తప్పి టర్న్ కావటంతో నడిరోడ్డుపై సడెన్ గా వచ్చింది. ఊహించని ఈ పరిణామాన్ని వెనకే వస్తున్న ఎస్సై.. తన బైక్ ను కంట్రోల్ చేసుకోలేకపోయారు. వేగంగా వెళ్లి కారు ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది.