హైదరాబాద్ వనస్థలిపురం SBI ఏటీఎంలో భారీ చోరీ

robbery in vanasthalipuram sbi atm: హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఏటీఎం సెంటర్‌లో భారీ చోరీ జరిగింది. ఏటీఎం మెషిన్‌లను గ్యాస్ కట్టర్‌తో కట్ చేశారు దుండగులు. మిషన్‌లో ఉన్న మొత్తం నగదును అపహరించుకుపోయారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహారా రోడ్‌లో ఉన్న SBI బ్యాంక్ ఏటీఎంలో దుండగులు ఈ చోరీ చేశారు.
https://10tv.in/belgian-best-racing-pigeon-new-kim-record-rs-14-crore-in-online-auction/
ఏటీఎం చోరీ విషయాన్ని తెలుసుకున్న రాచకొండ పోలీసులు ఘటన స్థాలానికి చేరుకున్నారు. దొంగతనం ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం నాలుగు టీమ్స్‌ను పోలీసులు ఏర్పాటు చేశారు. ఘటనా స్థలానికి క్లూస్ టీమ్ కూడా చేరుకుంది.