బ్యాంకులకు జనం పరుగులు : జన్ థన్ ఖాతాలపై ఆరా

  • Published By: veegamteam ,Published On : April 3, 2019 / 05:34 AM IST
బ్యాంకులకు జనం పరుగులు : జన్ థన్ ఖాతాలపై ఆరా

Updated On : April 3, 2019 / 5:34 AM IST

జన్ థన్ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయా.. ఒక్కొక్కరికి 10 లక్షలు పడతాయా.. అడ్వాన్స్ గా  10వేల రూపాయలు ఇచ్చారా ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1,700 ఖాతాల్లో ఒక్కొక్కరికి 10వేల రూపాయలు పడ్డాయి. ఈ విషయంలో సంచలనంగా మారింది. ఎవరు వేశారో.. ఎందుకు వేశారో ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవు అని చెప్పటం కూడా విచిత్రంగా అనిపిస్తోంది. దీనిపై ఈసీ దర్యాప్తు చేపట్టింది. వాస్తవంగా అయితే మన బ్యాంక్ అకౌంట్ లో రూపాయి పడినా.. రూపాయి తీసిన ప్రతిదానికీ లెక్క ఉంటుంది. అలాంటిది జన్ థన్ ఖాతాల్లో 10వేల రూపాయలు పడితే.. విచారణ చేస్తున్నాం.. ఎవరో వేశారో.. ఎందుకు వేశారో పరిశీలిస్తున్నాం అని చెప్పటం వెనక మర్మం ఏంటో ఎవరకీ అర్థం కావటం లేదు.

బ్యాంకులకు జనం పరుగులు :
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1,700 బ్యాంకు ఖాతాల్లో 10వేల రూపాయల చొప్పున డబ్బులు పడ్డాయని తెలిసిన వెంటనే.. మిగతా వారు కూడా బ్యాంకులు, ATM సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. ఖాతాల్లోని నగదు నిల్వలు పరిశీలించుకుంటున్నారు. మా ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా అని చెక్ చేసుకుంటున్నారు. డబ్బులు పడి ఉంటే వెంటనే డ్రా చేసేసుకుంటున్నారు. ఎందుకంటే మళ్లీ వెనక్కి వెళతాయనే భయం. పడని వారు మాత్రం మాకు ఇంకా రాలేదు.. ఎప్పుడు వస్తాయి అంటూ బ్యాంక్ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారంట.

తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ :
యూపీలోని కొన్ని జన్ థన్ ఖాతాల్లో డబ్బులు పడిన విషయం తెలిసి.. తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. అసలే ఎన్నికల టైం.. మా బ్యాంకు ఖాతాల్లో కూడా డబ్బులు ఏమైనా పడ్డాయా అని ఆరా తీయటం మొదలుపెట్టారు. ఏప్రిల్ 2న ఏపీలోని నిరుద్యోగుల ఖాతాల్లో 2వేల రూపాయల భృతి పడింది. పసుపు-కుంకుమ డబ్బులు డిపాజిట్ కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే జన్ థన్ ఖాతాల్లోనూ ఏమైనా డబ్బులు పడ్డాయా అని ఆరా తీస్తున్నారు. పల్లెల్లోని పేరంట్స్ అయితే.. పట్టణాల్లోని కొడుకులు, కూతుళ్లు, బంధువులకు ఫోన్ చేసి విషయాలు తెలుసుకుంటున్నారు.

2014, ఆగస్ట్ 28వ తేదీన దేశవ్యాప్తంగా పేదలందరికీ జన్ థన్ ఖాతాలను తెరిచే కార్యక్రమం ప్రారంభం అయ్యింది.