ఆర్టీసీ బస్సు ఆచూకీ లభ్యం : ముక్కలు ముక్కలుగా చేసిన దుండగులు

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 02:28 PM IST
ఆర్టీసీ బస్సు ఆచూకీ లభ్యం : ముక్కలు ముక్కలుగా చేసిన దుండగులు

Updated On : April 25, 2019 / 2:28 PM IST

హైదరాబాద్ సీబీఎస్ లో చోరీకి గురైన ఆర్టీసీ మెట్రో బస్సు ఆచూకీ లభ్యం అయింది. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కంకిడిలో బస్సును గుర్తించారు. బస్సు ఆనవాళ్లు లేకుండా దుండగులు పార్టులన్నింటినీ విడగొట్టి ముక్కలుగా చేశారు. బస్సును ఇనుప సమానుగా మార్చారు. నాందేడ్ పోలీసులు దుండగులను అరెస్టు చేశారు. కుషాయిగూడ ఆర్టీసీ డిపో మేనేజర్ జగన్ నాందేడ్ కు వెళ్లారు. నాందేడ్ కు బస్సును ఎవరు తీసుకెళ్లారన్న దానిపై స్పష్టత రాలేదు.

కుషాయిగూడ డిపోకు చెందిన 2009 మోడల్, నంబర్ AP11Z6254 ఆర్టీసీ మెట్రో సిటీ బస్సును మంగళవారం (ఏప్రిల్ 23, 2019)న రాత్రి హాల్ట్ కోసం డ్రైవర్, కండక్టర్ సీబీఎస్ లో ఉంచారు. తిరిగి తెల్లవారుజామున వచ్చి చూసే సరికి బస్సు కనిపించలేదు. రాత్రి సీబీఎస్ నుండి ఆర్టీసీ మెట్రో బస్సును దుండగులు చోరీ చేశారు. కంగుతిన్న డ్రైవర్, కండక్టర్ ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు. బస్సు చోరీకి గురైనట్లుగా అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. తుప్రాన్ టోల్ గేట్ దగ్గర సీసీటీవీలో బస్సు దృశ్యాలు రికార్డు అయ్యాయి.