మెట్రో రికార్డ్ : జస్ట్ 4 గంటల్లో 78వేల మంది

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికుల చూపు మెట్రో రైలుపై పడింది. బస్సులు తిరక్కపోవడంతో మెట్రో సర్వీసులకు డిమాండ్ పెరిగింది. గమ్య స్థానాలకు

  • Published By: veegamteam ,Published On : October 5, 2019 / 08:03 AM IST
మెట్రో రికార్డ్ : జస్ట్ 4 గంటల్లో 78వేల మంది

Updated On : October 5, 2019 / 8:03 AM IST

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికుల చూపు మెట్రో రైలుపై పడింది. బస్సులు తిరక్కపోవడంతో మెట్రో సర్వీసులకు డిమాండ్ పెరిగింది. గమ్య స్థానాలకు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికుల చూపు మెట్రో రైలుపై పడింది. బస్సులు తిరక్కపోవడంతో మెట్రో సర్వీసులకు డిమాండ్ పెరిగింది. గమ్య స్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు క్యూ కట్టారు. ఈ క్రమంలో మెట్రో సరికొత్త రికార్డ్ సృష్టించింది. తక్కువ సమయంలో ఎక్కువ మంది ప్రయాణించారు. జస్ట్ 4 గంటల్లో 78వేల మంది జర్నీ చేశారు.

శనివారం(అక్టోబర్ 5,2019) ఉదయం 10 గంటల వరకు 78వేల మంది మెట్రోలో ప్రయాణం చేశారని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సాధారణ రోజుల్లో ఈ సంఖ్య 42వేలుగా ఉండేదన్నారు. శనివారం సరికొత్త రికార్డ్ క్రియేట్ అయిందన్నారు. ఆర్టీసీ బస్సులు బంద్ కావడంతో మెట్రోకు ప్రయాణికుల తాకిడి పెరిగిందన్నారు.

శనివారం ఉదయం నుంచి మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగించింది. అర్థరాత్రి 12.30 గంటల వరకూ అందుబాటులో ఉంటాయి. ఉదయం 5 గంటల నుంచే మెట్రో సర్వీసులు ప్రారంభం అయ్యాయి.

రద్దీగా ఉంటే ప్రతి 3 నిమిషాలకు ఓ రైలును నడపుతామని అధికారులు చెప్పారు. రద్దీని తట్టుకోవడానికి వీలుగా అదనపు టికెట్‌ కౌంటర్లు, యంత్రాలు ఏర్పాటు చేశారు. అదనపు సిబ్బందిని నియమించారు. రద్దీ నిర్వహణ నిమిత్తం ఎల్బీనగర్‌, అమీర్‌పేట్‌, హైటెక్‌ సిటీ, సికింద్రాబాద్‌ ఈస్ట్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌ వంటి ముఖ్యమైన స్టేషన్లలో మెట్రో సీనియర్‌ అధికారులు విధుల్లోకి దిగారు.