రూరల్ ట్రాన్స్‌పోర్టు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

  • Published By: veegamteam ,Published On : February 2, 2019 / 03:33 AM IST
రూరల్ ట్రాన్స్‌పోర్టు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

Updated On : February 2, 2019 / 3:33 AM IST

తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, ఎక్స్ ఆఫీషియో మేనేజింగ్ డైరెక్టర్, షెడ్యూల్ తెగల ఆర్థిక సహాయ సంస్థ (ట్రైకార్)ల సంయుక్త ఆధ్వర్యం లో జిల్లాకు 2017-18వ ఆర్థిక సంవత్సరానికి వార్షిక కార్యచరణ ప్రణాళిక కింద బ్యాంకు ప్రమేయంతో ఈ ఆర్థిక సహాయం అమలు చేస్తున్నామని, ఆసక్తి గల గిరిజన నిరుద్యోగ యువతకు రూరల్ ట్రాన్స్‌పోర్టు పథకం ద్వారా వివిధ రకాల ట్రాన్స్‌పోర్టు వాహనాల కేటాయింపునకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 

టాటా ఎఫ్‌ఏసీ పికప్, ఆశోకా లెయిలాండ్ డోస్ట్ ఫ్లస్, మహేంద్ర బోలోరో వాహనాలు సబ్సిడీ నిధులు పొందుటకు ఈ నెల 8లోపు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం నందు నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు గాంధీభవన్ ఎదురుగా ఉన్న జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిలో దరఖాస్తు చేసుకోవాలి. 

అర్హులు:
8వ తరగతి పాస్, 10వ తరగతి పాస్/ఫెయిల్ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆధార్ కార్డు, కులం, ఆదాయం సర్టిఫికెట్స్, వయస్సు 21 నుంచి 40 సంవత్సరాల వరకు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులకు లైట్ మోటార్ వెహికల్ (LMV) లైసెన్స్‌తో పాటు  RTC కేటాయించిన బ్యాచ్ కలిగి ఉండాలని, సంవత్సర ఆదాయం రూ. 2 లక్షల లోపు ఉన్న వారే అర్హులవుతారని తెలిపారు.