పతంగుల అడ్డా : దటీజ్ ధూల్‌పేట

  • Published By: veegamteam ,Published On : January 13, 2020 / 07:09 AM IST
పతంగుల అడ్డా : దటీజ్ ధూల్‌పేట

Updated On : January 13, 2020 / 7:09 AM IST

పతంగుల పండగ వచ్చేసింది. సంక్రాంతి అంటే పంతంగులతో చిన్నా పెద్దా ఉత్సాహంగా ఒకరితో ఒకరు పోటీ పడి ఆడే ఆట పతంగుల ఆట. సంక్రాంతి వచ్చిందంటే చాలు కొత్త కొత్త పతంగులు గాల్లోకి సందడి చేస్తాయి. ఈ పతంగులకు పెట్టింది పేరు హైదరాబాద్ నగరంలోని ధూల్ పేట. అడ్డాగా ధూల్‌పేటనే.దూల్‌పేటకు పతంగులు కొనటానికి నగరంలో నుంచే కాక పక్కజిల్లాలనుంచి కూడా వచ్చి కొనుక్కొను వెళుతుంటారు. ధూల్‌పేటలో అందరినీ నచ్చిన..మెచ్చిన పతంగులు అన్ని సైజుల్లోను అందుబాటులో ఉంటాయి. అక్టోబర్‌, నవంబర్‌ నుంచే పతంగుల్ని తయారు చేస్తుంటారు ధూల్‌పేటవాసులు. 

ఈ పతంగుల్ని తక్కువ బరువు ఉండే పేపర్లతో తయారు చేస్తారు. తక్కువ బరువుతోపాటు వంగే గుణం ఉండి త్వరగా విరగని సన్నని వెదురుబద్దలతో గాలిపటం తయారు చేయటంలో ధూల్‌పేటవాసులు సాటి ఎవ్వరూ రారు.  అక్టోబర్ నెల నుంచే జనవరి నెలల్లోనే గాలిపటాలు ఎగరేయడానికి ఉన్న శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఈ సమయంలో మాత్రమే గాలి ఒక పద్ధతిగా వీస్తుంది. ఒకే వైపు ఎక్కువ సేపు ఆటుపోట్లు లేకుండా సాధారణంగా గాలి అనువుగా వీయడమే దీనికి కారణం. తక్కువ ధరకు చక్కటి క్వాలిటీ కలిగిన పతంగులు ధూల్‌పేట స్పెషల్. రూ.2 నుంచి రూ.200 వరకూ ఉంటాయి. సంక్రాంతికి ముందు అమ్మకాలు జోరుగా జరుగుతాయి. ఒక్కో దుకాణంలో 5 వేల నుంచి 10 వేల వరకూ గాలిపటాల అమ్మకాలు జరుగుతుంటాయి అంటే ధూల్ పేట పంతంగులకు డిమాండ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. 

పంతంగుల ఎగురవేయటంలో మాంజాలదే స్పెషల్. మాంజాలు 900 మీటర్లకు రకాన్ని బట్టి రూ.40 నుంచి రూ. 200 వరకూ అమ్ముడైపోతాయి. ధూల్ పేటలో మాంజాలు  కాటన్‌తో తయారు చేస్తారు.దీంతో ప్రమాదం ఏమీ ఉండదు. 

ప్రేమను తెలిపే పతంగులు..
పతంగ్‌ ప్రియులను ఆకర్షించటానికి తయారీదారులు వెరైటీలను తయారు చేస్తారు. ప్రేమను వ్యక్త పర్చే పతంగులు కూడా ధూల్ పేటలో దొరుకుతాయి. న్యూ ఇయర్ విషెస్, సంక్రాంతి శుభాకాంక్షలు ఇలా అన్ని రకాలుగా శుభాకాంక్షలు తెలిపే పతంగులు ధూల్ పేటలో తయారు చేస్తారు. చిన్నారులకు ఇష్టపడే చోటా భీం, మిస్టర్‌బీన్‌ వంటి ఎన్నో క్యారెక్టర్లను పతంగులపై ఉంటాయి.  అంతేకాదు ట్రెండ్ ను అనుసరిస్తూ పతంగుల్ని తయారు చేస్తుంటారు ధూల్ పేట వాసులు. ఇలా ప్రతీ ఏటా మారే ట్రెండ్ కు అనుగుణంగా కష్టమర్లను టేస్ట్ లకు తగినట్లుగా పతంగులు తయారు చేయటంలో ధూల్ పేట వాసులు మంచి పేరు తెచ్చుకున్నారు. మరి అందరూ లోకల్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయండి…అందరూ ధూల్ పేట పతంగుల్ని కొనండి..