హైదరాబాద్‌కు మోడీ..భారీ భద్రత

  • Published By: madhu ,Published On : March 29, 2019 / 04:05 AM IST
హైదరాబాద్‌కు మోడీ..భారీ భద్రత

Updated On : March 29, 2019 / 4:05 AM IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 11న జరుగనున్న సంగతి తెలిసిందే. బీజేపీ నిర్వహించే ఎన్నికల ప్రచార సభలకు మోడీ హాజరు కానున్నారు. ఏప్రిల్ 1వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహించనుంది. ఇందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరవుతుండడంతో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ జరిగే ప్రాంతం వద్ద వెయ్యి మందికిపైగా పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. 
Read Also : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రివ్యూ

SSG అధికారులు భద్రతా ఏర్పాట్లపై హైదరాబాద్ పోలీసు అధికారులతో చర్చించారు. ఇందుకు రిహార్సల్స్ కూడా నిర్వహించాయి. ఎల్బీ స్టేడియం సమీపంలో ఉన్న అపార్ట్ మెంట్లు, వ్యాపార దుకాణాలపై ఎస్ఎస్‌జి అధికారులు నిఘా పెట్టారు. ఇక్కడ నివాసం ఉంటున్న వారి వివరాలను సేకరించారు.

కొత్తగా ప్లాట్లలో నివాసం ఉండేందుకు వచ్చే వారి వివరాలను మార్చి 31వ తేదీలోపు ఇవ్వాలని అధికారులు సూచించారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో కొత్తగా నిర్మాణాలు చేపట్టవద్దని జీహెచ్ఎంసీ, ఇతర శాఖ అధికారులకు సూచించారు. అంతేగాకుండా ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల్లోనూ భారీ రిపేర్లు చేయవద్దని కూడా సూచించారు. 
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష