హైదరాబాదీలు రెడీ అవ్వండి.. మేఘాలలో భోజనం చేద్దాం

హైదరాబాదీలు రెడీ అవ్వండి.. మేఘాలలో భోజనం చేద్దాం

Updated On : October 26, 2019 / 2:23 AM IST

దేశ రాజధానిలో మాత్రమే ఉన్న మేఘాల్లో డైనింగ్. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ మొదలుకానుంది. క్లౌడ్ డైనింగ్‌ పేరిట  థ్రిల్లింగ్ డిజైన్‌తో 160అడుగుల ఎత్తులో దీన్ని రూపొందిస్తున్నారు. దీని కోసం హైగ్రేడ్ మెటల్ ప్లాట్ ఫాంపై అతి పెద్ద డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేశారు. ఒకేసారి 26మంది కూర్చొని భోజనం చేసేలా రెడీ అయింది. 

దీంతో పాటు భద్రత కోసం ప్రతి ఒక్కరికీ సీటు బెల్టులు అమరుస్తారు. ముందుగా రెడీ చేసిన 200టన్నుల టెలిస్కోపిక్ క్రేన్‌ను లేటెస్ట్ జర్మనీ టెక్నాలజీతో  ప్లాట్ ఫాంను 160అడుగుల ఎత్తులోకి తీసుకెళ్తారు. ఆహ్లాదభరితమైన సంగీతంతో పాటు భోజనం వడ్డించేందుకు నలుగురు చెఫ్‌లు ఉంటారు. 

శిల్పారామం ఎదురుగానే:
దాదాపు ఎకరం స్థలంలో ఈ రెస్టారెంట్‍‌ను ధలివాల్ క్రేన్స్, పీఆర్సీ లాజిస్టిక్స్ సంస్థలు సిద్ధం చేస్తున్నాయి. శిల్పారామం ఎదురుగా చేస్తున్న ఈ మేఘాల డైనింగ్‌లో సాయంత్రం 6.30గంటల నుంచి రాత్రి 11.30వరకూ తెరచి ఉంచుతున్నారు. రోజుకు మూడు సార్లుగా వేస్తున్న ఒక్కో ట్రిప్‌కు భోజనానికి గంట సమయం మాత్రమే కేటాయిస్తారు.