గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ : తెలంగాణ యువతకే ప్రాధాన్యత  

  • Published By: veegamteam ,Published On : November 1, 2019 / 09:22 AM IST
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ : తెలంగాణ యువతకే ప్రాధాన్యత  

Updated On : November 1, 2019 / 9:22 AM IST

దేశంలోని తొలి స్మాల్ స్కేల్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్‌లో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం(నవంబర్ 1,2019) ప్రారంభించారు.  ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..స్మాల్ స్కేల్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం తెలంగాణ యువతకు ఉపాధే లక్ష్యంగా జరుగుతుందని హామీ ఇచ్చారు.
35 వేల మందికి ఉపాధి
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణంతో ప్రత్యక్ష్యంగా 20వేల మందికి పరోక్షంగా 15వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. తెలంగాణ యువతకు స్కిల్ డెవలప్ మెంట్ 10 ఎకరాల్లో  ఓ సెంటర్ ను ఏర్పాటు చేయాలని..ఈ పార్క్ కోసం భూములు ఇచ్చినవారి పిల్లలకు ఇది ఉపయోగపడాలని పారిశ్రామిక వేత్తలకు మంత్రి సూచించారు. తెలంగాణ పౌరులకు ఉపాధే లక్ష్యంగా ప్రభుత్వం పలు పరిశ్రమలను ప్రారంభిస్తోందన్నారు. 

పర్యావరణ హితంగా స్మాల్ స్కేల్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ 
పరిశ్రమలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. అభివృద్దిలో దూసుకుపోతూ..దేశంలోని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు.పచ్చనిచెట్ల మధ్య దేశంలోని తొలి స్మాల్ స్కేల్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం జరిగినా..పచ్చదనానికి ఏమాత్రం భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. పర్యావరణ హితంగా పారిశ్రామికీకరణ జరగాలి.  గ్రీన్ ఇండ్రస్ట్రీకి మాత్రమే ఈ స్మాల్ స్కేల్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో అవకాశాన్ని కల్పిస్తున్నాని తెలిపారు.  స్మాల్ స్కేల్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో అతి తక్కువ ధరలకే పారిశ్రామిక వేత్తలకు భూములను ఇస్తున్నామన్నారు. రూ. 29 కోట్ల ఖర్చుతో భారీ రోడ్లను నిర్మించి సదుపాయాలు కల్పించాం.  

పారిశ్రామిక విధానంలో టీఎస్‌ఐపాస్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సింగిల్‌ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. టీఎస్‌ఐపాస్‌ ద్వారా 12 లక్షల ఉద్యోగాలు కల్పించాం.పరిశ్రమల విషయంలో తెలంగాణ అనుసరిస్తోన్న విధానం రేపు దేశంలోని అన్ని రాష్ర్టాలకు రోల్‌మోడల్‌ అవుతుందన్నారు.  ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రీకి ప్రభుత్వం అండగా నిలబడుతోంది. 70 శాతం ఉద్యోగాలు ఇచ్చేది ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలే. ఎంఎస్‌ఎంఈకి పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నామని తెలిపారు.

త్వరలోనే అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం 
పార్కులో చాలా స్వల్ప ధరకు మౌలిక వసతులు కల్పించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అంతర్గత రోడ్డు, కరెంట్‌, నీటి వసత వేగంగా పూర్తిచేస్తాం. ఏ పరిశ్రమ ఏర్పాటు చేసినా మహిళలకు ప్రత్యేక కోటా కేటాయిస్తున్నట్లు చెప్పారు. గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు దగ్గర 132 కేవీ సబ్‌స్టేషన్‌ ప్రారంభిస్తాం. వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేశాం. సంగారెడ్డి జిల్లాలో దేశంలోనే అతిపెద్ద మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌ ఏర్పాటు చేశాం. ప్లాస్టిక్‌ పార్క్‌, మైక్రో ప్రాసెసింగ్‌ పార్క్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. ఇలా తెలంగాణ యువతకు ఉపాధే లక్ష్యంగా ఈ స్మాల్ స్కేల్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణంతో జరగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.