తల్లిపై దాడి చేసిన కొడుకుకు జైలు శిక్ష
హైదరాబాద్ లో తల్లి, కుటుంబ సభ్యులపై దాడి చేసిన వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్షను విధించింది.

హైదరాబాద్ లో తల్లి, కుటుంబ సభ్యులపై దాడి చేసిన వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్షను విధించింది.
ఎవరైనా తల్లిదండ్రులను కొడుతున్నారా? వేధిస్తున్నారా? కుంటుబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారా..అయితే జైలుకు వెళ్లడం ఖాయం. హైదరాబాద్ లో తల్లి, కుటుంబ సభ్యులపై దాడి చేసిన వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్షను విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెహిదీపట్నం అఫ్జల్‌సాగర్ కట్టమైసమ్మ దేవాలయం సమీపంలో నివసించే ఫుష్పలత కుమారుడు వెంకటేశ్ జులాయిగా తిరుగుతున్నాడు. కొన్ని రోజులుగా ఇంట్లో గొడవ చేస్తూ కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు.
ఈ క్రమంలో తల్లితోపాటు కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి ఫుష్పలత చేతికి గాయాలయ్యాయి. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి.. నిందితుడు వెంకటేశ్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు.. వెంకటేశ్‌కు రెండు రోజుల జైలు శిక్షను విధించిందని హబీబ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ శివచంద్ర తెలిపారు.
తల్లిండ్రులు, కుటుంబ సభ్యులను వేధిస్తున్న, వారిపై దాడి చేస్తున్న వారికి ఈ తీర్పు హెచ్చరిక లాంటింది. అందుకే కన్నతల్లిండ్రులను, కుటుంబ సభ్యులను మంచిగా చూసుకుంటే మంచిదంటున్నారు.