జపాన్ తర్వాత ఇండియానే : అమెరికా సైనికులకు హైదరాబాద్‌లో ట్రైనింగ్

హైదరాబాద్ : అమెరికా సైనికులు హైదరాబాద్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అమెరికాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్ బృందం హైదరాబాద్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటోంది. అమెరికా తన సైనికులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు జపాన్‌లోని ఓకినావా తర్వాత భారత్‌లోని హైదరాబాద్‌నే సెలక్ట్ చేసుకుంది. ఈ క్రమంలో నగర శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఎన్‌ఎస్‌జీ సెంటర్‌లో భారతదేశానికి చెందిన నేషనల్ సెక్యురిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ)తో కలిసి అమెరికా సైనికులు ట్రైనింగ్ పొందుతున్నారు. మార్చి 12న ప్రారంభమైన ఈ స్పెషల్ ట్రైనింగ్ ఏప్రిల్ 5వ తేదీ వరకు కొనసాగనుంది. భవిష్యత్తులో విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు భారత్, అమెరికా దేశాల బలగాలు కలిసి ఎదుర్కోవడంపై శిక్షణ ఇస్తున్నట్టు యూఎస్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండో హెచ్‌ఎం స్మిత్ తెలిపారు.
Read Also : మళ్లీ చైనా అడ్డుపుల్ల : అజర్‌పై ఉగ్ర ముద్ర వేసేందుకు అభ్యంతరం
కమాండో ఆపరేషన్స్..యుద్ధంలో తీసుకోవాల్సిన టెక్నిక్స్ వంటి పలు అంశాలపై ట్రైనింగ్ ఇస్తున్నామని స్మిత్ తెలిపారు. పసిఫిక్ రీజియన్‌లో ఉగ్రదాడులు ఎదుర్కోవడంతోపాటు శాంతిస్థాపన కోసం భారత్‌తో కలిసి పనిచేయడంలో భాగంగా అమెరికా ఈ శిక్షణ చేపట్టింది. ఈ క్రమంలో భారతదేశాన్ని ముఖ్యమైన రక్షణ విభాగంగా అమెరికా భావిస్తోంది. దీంతో హైదరాబాద్.. డిఫెన్స్ టెక్నాలజీ..స్కిల్స్ డెవలప్ మెంట్ అమెరికా-భారత్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారే అవకాశం ఉన్నదని మిలిటరీ వర్గాలు తెలుపుతున్నాయి. యూఎస్ కౌన్సిల్ జనరల్ కేథరిన్‌హడ్డా మాట్లాడుతూ ఈ ట్రైనింగ్ తో డిఫెన్స్ కు సంబంధించి భారత్-అమెరికా మధ్య ఉన్న సమన్వయం మరింత బలపడుతుందని చెప్పారు.
Read Also : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ యూజర్లకు ఇబ్బందులు.. సైబర్ దాడులు జరిగాయా?