ఎండలు మండుతున్నాయి @ మెదక్ 38.8

తెలంగాణలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు మండుతున్నాయి.

ఎండలు మండుతున్నాయి @ మెదక్ 38.8

Sunny Intensity High Telangana

Updated On : October 25, 2021 / 12:09 PM IST

తెలంగాణలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు మండుతున్నాయి.

హైదరాబాద్ : భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత కొనసాగుతుంది. వాయవ్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో తెలంగాణలో మార్చి 23 శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రంలో మార్చి 24 ఆదివారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోని మెదక్ 38.8, నిజామాబాద్ 37.4, ఆదిలాబాద్ 37.3, హైదరాబాద్ 37.2, ఖమ్మం 36.8, హన్మకొండ 36.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.