అధ్యయనం కోసం : తుమ్మిడిహెట్టి పర్యటనకు టి.కాంగ్రెస్ నేతలు

తుమ్మిడిహెట్టి పర్యటనకు టి.కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు ఆగస్టు 26వ తేదీన తుమ్మిడిహెట్టి వద్దనున్న ప్రాణహిత నది పరిశీలనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వం వహించనున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 38వేల కోట్లతో 16.5 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ సర్కార్ రీ-డిజైన్ పేరుతో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పక్కనపెట్టి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టింది. అయితే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారా నీరు వచ్చేదని.. ఈపాటికే ప్రాజెక్టు పూర్తి అయ్యేదని… కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్ట్ చేపడితే ఒక్కపైసా భారం లేకుండా ప్రాజెక్టు పూర్తయ్యేదని కాంగ్రెస్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు వాస్తవాలను అధ్యయనం చేయడం కోసం తుమ్మిడిహెట్టి పర్యటనకు రెడీ అయ్యారు.
Read More : తెలంగాణలో 183 పెట్రల్ బంకులకు నోటీసులు