ప్రజలు వాత పెట్టినా బుద్ధి రాలేదు: తలసాని శ్రీనివాస్

  • Published By: vamsi ,Published On : April 26, 2019 / 10:58 AM IST
ప్రజలు వాత పెట్టినా బుద్ధి రాలేదు: తలసాని శ్రీనివాస్

Updated On : April 26, 2019 / 10:58 AM IST

ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి ఒక విజన్ ఉందని, ఆ విజన్‌కు అనుగుణంగానే మేం ముందుకు వెళ్తున్నామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మానవ సమాజంలో మనిషి బ్రతకాలంటే కరెంటు, నీళ్లు రెండే ముఖ్యమని, వాటి అభివృద్ధికి స్టెప్‌బై స్టెప్ కృషి చేస్తున్నామని తలసాని అన్నారు. అయితే ప్రజలు వాతలు పెట్టినా కూడా కాంగ్రెస్ నేతలకు బుద్ధి రాట్లేదని తలసాని విమర్శించారు. లేకీలేకీ మాటలను ఎక్కువగా మట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు.

టీఆర్ఎస్ తరుపున గెలిచిన 88మందితో కాకుండా కొత్తగా వచ్చేవాళ్లతో ప్రభుత్వం ఏం  ఏర్పడట్లేదు కదా? అని తలసాని . ఇకనైనా నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఇంటర్ విద్యార్ధల సమస్యలపై సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకుంటున్నామని, పిల్లలు ఈలోపే అమాయకంగా తొందరపడ్డారని, పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ తొందరపడొద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, గవర్నమెంట్ బాధ్యతగా ఉన్నదని తలసాని అన్నారు.