టిడిపికి నూతన నాయకత్వం అవసరం : చంద్రబాబు

తెలంగాణాలో పార్టీ పున:నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో నూతన నాయకత్వం టిడిపికి అవసరమని అభిప్రాయపడ్డారు.

  • Published By: veegamteam ,Published On : September 14, 2019 / 02:24 PM IST
టిడిపికి నూతన నాయకత్వం అవసరం : చంద్రబాబు

Updated On : September 14, 2019 / 2:24 PM IST

తెలంగాణాలో పార్టీ పున:నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో నూతన నాయకత్వం టిడిపికి అవసరమని అభిప్రాయపడ్డారు.

తెలంగాణాలో పార్టీ పున:నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో నూతన నాయకత్వం టిడిపికి అవసరమని అభిప్రాయపడ్డారు. నాయకత్వ లోపాన్ని దిద్దుకోవాలని సూచించారు. 119 నియోజకర్గస్థాయిలో పార్టీ ఎల్లప్పుడూ పునర్నిర్మాణం చేస్తూ ఉన్నామని తెలిపారు. హైదరాబాద్ లో టిడిపి పుట్టిందని, ఎన్టీఆర్ పార్టీ పెట్టారని గుర్తు చేశారు. కొందరు నాయకులు పోయారు.. కానీ కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. శనివారం (సెప్టెంబర్ 14, 2019) హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టి.టీడీపీ 17 పార్లమెంట్ సమన్వయ కమిటీ సభ్యులు, ముఖ్య నేతలతో ఆయన సమావేశం అయ్యారు.

తెలంగాణలో టిడిపి బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించానని చెప్పారు. ప్రతి శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి వస్తానని తెలిపారు. ఎవరైనా ఎప్పుడైనా తనతో నేరుగా మాట్లాడొచ్చని..అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. టిడిపి తెలంగాణలో ఉండటం చారిత్రక అవసరం అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎన్నో చేశానని తెలిపారు. తెలంగాణాలో ఎవ్వరు బయపడవద్దన్నారు. వచ్చే శనివారం మళ్ళీ సమావేశం అవుతానన్నారు. కమిటీలు వేస్తాను.. మళ్ళీ క్షేత్ర స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మాణం చేస్తామని చెప్పారు. టిడిపిపై అభిమానం ఉన్న వాళ్ళు ముందుకు రావాలన్నారు. అన్ని స్థాయిల్లో సమర్ధ నాయకులను పెడ్తామని చెప్పారు.

తెలంగాణాలో శక్తివంతమైన పార్టీగా ఎదగాలన్నారు. ఇద్దరిని గెలిపిస్తే.. ఒక్కరు పోయారు.. కానీ మిగిలిన ఎమ్మెల్యే మచ్ఛా నాగేశ్వర్ రావు.. పార్టీ కోసం అంకితం అయ్యారని కొనియాడారు. కొంతమంది నాయకులు వారి స్వార్థంతో పోయారు…ఒక నాయకుడు పోతే..వందమంది నాయకులను తయారుచేసుకుందామని అన్నారు. వారు స్వార్థంతో పోయారు..ఒంటరి వాళ్ళయ్యారు…మీరు నిస్వార్థంతో వచ్చారు… ఈ ప్రాంతంలో టీడీపీ బలోపేతం కావడానికి మీరంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. సమర్ధవంతమైన సైనికులను తయారు చేస్తా…ఈ ప్రాంతంలో టీడీపీ తిరిగి రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏపీలో అమరావతి సిటీని చంపేలా ఉన్నారని.. తాను రాజీ పడేది లేదన్నారు. అమరావతిలో నదుల అనుసంధానం నిలిచిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాజధాని అభివృద్ధిని వదిలేశారు…అయినా అధైర్యపడొద్దు…మంచి రోజులొస్తాయన్నారు.