ఎన్నికల సందడి : మూడు దశల్లో స్థానిక సమరం

తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై TRS ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ZPTC, MPTCల పదవీకాలం ముగియనుండడంతో.. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏప్రిల్ మూడో వారంలో నోటిఫికేషన్ వెలువుడే అవకాశం ఉండడంతో.. టీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేసే పనిలో పడింది. కొత్త జిల్లాల ఆవిర్భావంతో.. జిల్లా పరిషత్ ఛైర్మన్ స్థానాల సంఖ్య 9 నుండి 32కు పెరిగింది. వీటితో పాటు.. 530కి పైగా మండల పరిషత్‌ల్లో విజయకేతనం ఎగురవేసేందుకు టీఆర్ఎస్ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది.
మే నెలలో మూడు దశల్లో MPTC, ZPTC ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. మే 6, మే 10, మే 14 తేదల్లో పరిషత్ ఎన్నికలు జరుగుతాయని, షెడ్యూల్‌ని ప్రభుత్వానికి అందచేసినట్లు సమాచారం. ఓ నిర్ణయానికి వచ్చిన తరువాత అధికారికంగా ప్రకటిస్తారు. మూడు దశల్లోనూ ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఎన్నికల ప్రకటన వెలువడే రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది.
ఎన్నికల సంఘం ప్రతిపాదిత షెడ్యూల్ : –
1వ దశ | 2వ దశ | 3వ దశ | |
ఎన్నికల ప్రకటన | ఏప్రిల్ 22 | ఏప్రిల్ 26 | ఏప్రిల్ 30 |
నామినేషన్లకు చివరి తేదీ | ఏప్రిల్ 24 | ఏప్రిల్ 28 | మే 2 |
నామినేషన్ల పరిశీలన | ఏప్రిల్ 25 | ఏప్రిల్ 29 | మే 3 |
నామినేషన్ల ఉపసంహరణ | ఏప్రిల్ 28 | మే 2 | మే 6 |
పోలింగ్ | మే 6 | మే 10 | మే 14 |