లక్కీ ఛాన్స్: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ అహ్మద్‌ఖాన్

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 11:43 AM IST
లక్కీ ఛాన్స్: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ అహ్మద్‌ఖాన్

హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ఖరారు చేశారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ముంతాజ్ ఖానే సీనియర్. దీంతో ఆయనకు ఆ పదవిని అప్పగించారు. ముంతాజ్ ఖాన్ చార్మినార్ నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తమ పార్టీ ఎమ్మెల్యేని ప్రొటెం స్పీకర్‌గా నియమించడంతో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్‌కు ట్వీట్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.