సోలార్ రూఫ్ టాప్ : అగ్రస్థానంలో తెలంగాణ
సోలార్ పవర్ జనరేషన్, వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్రాజెక్ట్ అమలులో జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తా చాటింది. కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ ఢిల్లీలో ఆర్‌పీఎం

సోలార్ పవర్ జనరేషన్, వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్రాజెక్ట్ అమలులో జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తా చాటింది. కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ ఢిల్లీలో ఆర్‌పీఎం
సోలార్ పవర్ జనరేషన్, వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్రాజెక్ట్ అమలులో జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తా చాటింది. కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ ఢిల్లీలో ఆర్‌పీఎం సమావేశంలో ‘స్టేట్ రూఫ్ టాప్ సోలార్ అట్రాక్టివ్‌నెస్ ఇండెక్స్(సరళ్)’ను విడుదల చేశారు. తెలంగాణకు 72.2 స్కోర్‌తో A++ గ్రేడ్ దక్కింది. సోలార్ పవర్ పాలసీ ప్రమాణాలు, వినియోగదారుల సంఖ్యలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లకు 4వేల 736 మంది దరఖాస్తు చేసుకోగా 3వేల 678 మందికి గ్రిడ్ కనెక్టివిటీ ఇచ్చారు. 3వేల 562 మెగావాట్ల సామర్థ్యాన్ని సాధించింది.
78.8 స్కోర్ తో కర్నాటక లీడ్ లో ఉండగా, 67.9 స్కోర్ తో గుజరాత్ థర్డ్ ప్లేస్ లో ఉంది. కర్నాటక, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలకు A++ గ్రేడ్ దక్కింది. పాలసీ ఫ్రేమ్ వర్క్, వినియోగదారుడి అనుభవం, ఎఫెక్టివ్ నెస్, అమలు విధానం అంశాలను పరిగణలోకి తీసుకుని రేటింగ్స్ ఇచ్చారు. సోలార్ పవర్ ఉత్పత్తి విషయంలో 2020 మార్చి నాటికి కేంద్రం 100 గిగా వాట్లు లక్ష్యంగా పెట్టుకుంది. గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్ టాప్ ద్వారా ఇప్పటివరకు 40 గిగావాట్లు ఉత్పత్తి సాధించారు. 95.21 మెగా వాట్ల సామర్థ్యంతో టార్గెట్ సాధనలో తెలంగాణ లీడ్ లో ఉంది. కేసీఆర్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో ఇది సాధ్యమైంది.