తెలంగాణ కేబినెట్ విస్తరణ : ఆ ఆరుగురికి మంత్రి పదవులు

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వేళైంది. ఆదివారం(సెప్టెంబర్ 8,2019) సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గంలో ఆరు

  • Published By: veegamteam ,Published On : September 8, 2019 / 02:30 AM IST
తెలంగాణ కేబినెట్ విస్తరణ : ఆ ఆరుగురికి మంత్రి పదవులు

Updated On : September 8, 2019 / 2:30 AM IST

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వేళైంది. ఆదివారం(సెప్టెంబర్ 8,2019) సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గంలో ఆరు

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వేళైంది. ఆదివారం(సెప్టెంబర్ 8,2019) సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండడంతో… మొత్తం ఇదే దఫాలో భర్తీ చేస్తున్నారు. మంత్రి పదవులు దక్కే ఆ ఆరుగురు ఎవరో కూడా తెలిసింది. హరీష్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ పేర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు సీఎంవో నుంచి సమాచారం వచ్చింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ సీఎంగా… మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఫిబ్రవరి 19న మరో 10మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఇప్పుడే రెండోసారి మంత్రివర్గాన్ని కేసీఆర్ విస్తరించనున్నారు. అంతేకాకుండా అన్ని రకాల పదవులను భర్తీ చేయాలని కూడా నిర్ణయించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ విప్‌ల నియామకాన్ని ఖరారు చేసిన కేసీఆర్‌… ఆదివారం దశమి పూట మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న మంత్రులకు ఉద్వాసన చెప్పకుండా మిగతా విస్తరణ పూర్తి చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణకు కొత్త గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌ కూడా ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రివర్గ విస్తరణ సమాచారాన్ని గవర్నర్‌కు సీఎం తెలియజేశారు.

ఖమ్మం జిల్లాకు ఇప్పటివరకు మంత్రివర్గంలో చోటు లేకపోవడంతో…ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కి అవకాశం దక్కింది. తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వీరయ్య పేర్లు కూడా వినిపించాయి. ఇద్దరు మహిళా మంత్రులను తీసుకుంటామని కేసీఆర్‌ గతంలో ప్రకటించారు. ఆ మాటను ఇప్పుడు నిలుపుకునే పనిలో ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లకు మంత్రి పదవులు ఖాయం చేశారు.