తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్: బుక్ మై షో, పేటిఎంలకు కేసిఆర్ షాక్

  • Published By: vamsi ,Published On : September 21, 2019 / 10:54 AM IST
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్:  బుక్ మై షో, పేటిఎంలకు కేసిఆర్ షాక్

Updated On : September 21, 2019 / 10:54 AM IST

వీకెండ్ ఎంటర్ టైన్ మెంట్ కోసం సినిమాకు వెళ్లాలనుకున్నారా? మనకు కనిపించే టిక్కెట్ ధర ఒకటి. బుక్  అయ్యాక పడే ధర మరొకటి.  రకరకాల టాక్స్‌లను టిక్కెట్లపై రుద్దేసి సామాన్యుడి జేబులను ఖాళీ చేస్తున్నాయి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్స్. అయితే ఆన్‌లైన్ దందాకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇస్తుంది.

సామాన్యుడి జేబులు ఖాళీ చేస్తున్న ఆన్‌లైన్ యాప్స్ కి చెక్ పెడుతూ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుక్ మై షో, పేటిఎం, ఈజీ మూవీస్ యాప్ లు సాగిస్తున్న అక్రమ వసూళ్లకు చెక్ పెడుతూ.. ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ టిక్కెట్ల అమ్మకాల కోసం ప్రత్యేక వెబ్ సైట్‌ను అందుబాటులోకి తచ్చేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.

దీని ద్వారా ఈ మేరకు నిర్ణయం తీసుకున్న కేసిఆర్.. సంబంధిత శాఖలతో ఇదే విషయానికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యాలెట్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రాగా.. ఆ వ్యాలెట్ చార్జీలు చాలా తక్కువగా ఉండడంతో చాలామందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అదే తరహాలో ప్రభుత్వమే ఒక వ్యాలెట్ ను అందుబాటులోకి తీసుకుని వస్తే సామాన్యులకు ఉపయోగకరం అని భావిస్తున్నారు ప్రజలు.