సౌతిండియా టాప్ : లిక్కర్ సేల్స్ లో తెలంగాణ రికార్డ్

న్యూ ఇయర్ వేళా.. లిక్కర్ ఏరులై పారింది. లక్షాలది లీటర్ల మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణలోనే భారీ స్థాయిలో లిక్కర్ సేల్ అయిందంటే నమ్ముతారా? అవును. ఇది నిజం.

  • Published By: sreehari ,Published On : January 3, 2019 / 05:06 AM IST
సౌతిండియా టాప్ : లిక్కర్ సేల్స్ లో తెలంగాణ రికార్డ్

న్యూ ఇయర్ వేళా.. లిక్కర్ ఏరులై పారింది. లక్షాలది లీటర్ల మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణలోనే భారీ స్థాయిలో లిక్కర్ సేల్ అయిందంటే నమ్ముతారా? అవును. ఇది నిజం.

  • దక్షణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్

న్యూ ఇయర్ వేళా.. లిక్కర్ ఏరులై పారింది. లక్షాలది లీటర్ల మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణలోనే భారీ స్థాయిలో లిక్కర్ సేల్ అయిందంటే నమ్ముతారా? అవును. ఇది నిజం. న్యూ ఇయర్ వేడుకలకు లిక్కర్ కు ఉండే గిరాకీ ఇలానే ఉంటుంది మరి. అంతటి లిక్కరు అమ్ముడు పోయిన రాష్ట్రాల్లో తెలంగాణే నెంబర్ వన్ గా నిలిచింది. 2018 ఏడాదిగానూ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడునెలల్లో మొత్తం లిక్కర్ అమ్మకాలు జోరుగా కొనసాగాయి.

గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో 20.11 శాతం మేర లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగినట్టు తేలింది. దక్షిణా రాష్ట్రాల్లో లిక్కర్ సేల్స్ జాబితాలో తెలంగాణనే టాప్ ర్యాంకులో నిలిచింది. తెలంగాణ తరువాత రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్ 19 శాతం రికార్డు సాధించగా.. ఏకకాలంలో తమిళనాడు (17.7 శాతం), కేరళ (15.15), కర్ణాటక (12.1 శాతం) తరువాత స్థానాల్లో నిలిచాయి. ఐదు రాష్ట్రాల్లో తమిళనాడులో అధికంగా (రూ. 21,831 కోట్లు) లిక్కర్ అమ్మకాలు జరగగా కర్ణాటకలో రూ.13,870 కోట్ల వరకు టర్న్ ఓవర్ జరిగినట్టు గణాంకాలు వెల్లడించాయి. ఇదే కాలంలో తెలంగాణలో జరిగిన లిక్కర్ అమ్మకాలను గణించి చూస్తే.. రికార్డు స్థాయిలో సేల్స్ జరిగినట్టు వెల్లడైంది. 

గత ఏడాదిలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు తెలంగాణలో రూ.9,902 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరగగా.. 2018 సంవత్సరంలో రాష్ట్రంలో రూ. 11,894 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిపి రికార్డు బద్దలు కొట్టింది. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో రూ.18,165 కోట్లు, కర్ణాటకలో రూ.12,383 కోట్లు వరకు అమ్మకాలు జరిగాయి. ఇక ఏపీలో 2017 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో రూ. 9,720 కోట్లు లిక్కర్ సేల్స్ జరిగాయి. 2018 తెలంగాణ మద్యం అమ్మకాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.

కేరళలో మద్యం అమ్మకాల శాతం 15.15 శాతం పెరగగా, 2018లో అమ్మకం విలువ రూ.8357 కోట్ల వరకు పెరిగింది. 2016, 2015 ఏడాదిలో మాత్రం ఏపీ, తెలంగాణలో గ్రోత్ రేటు స్వల్పంగా తగ్గినట్టు కనిపించింది. 2017 ఏడాది చివరిలో గ్రోత్ రేటు 26.75 శాతం నమోదు కాగా, తెలంగానలో 24.06 శాతం మేర నమోదైంది. డిసెంబర్ 31 జరిగిన లిక్కర్ అమ్మకాల్లో ఏపీలో రూ.118 కోట్ల అమ్మకాలకే పరిమితం కాగా.. తెలంగాణలో మాత్రం రూ. 133 కోట్ల వద్ద స్థిరంగా నిలిచింది. కానీ, జనవరి 2 నాటికి ఏపీతో పోలిస్తే రూ. 68 కోట్లతో ఫిగర్ ఒక్కసారిగా పడిపోయాయి. డిసెంబర్ 31తో పోలిస్తే తెలంగాణలో 30 శాతం మేర లిక్కర్ సేల్స్ పడిపోయాయి. 

బీర్లు అమ్మకాల్లోనూ టాపే.. 
బీర్ల అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. దక్షణాది రాష్టాల్లో ఒక్క తెలంగాణలో బీర్లు అత్యధిక స్థాయిలో అమ్ముడుపోయాయి. 2018 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యాకాలంలో బీర్లు తాగినవారి సంఖ్య 302.84 లక్షలకు పైమాటే. ఇక ఏపీలో మాత్రం 169 లక్షల బీర్లు అమ్ముడుపోయాయి.