ఓటు కంటే టూరే : పోలింగ్ పై లాంగ్ వీకెండ్ ప్రభావం
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతున్నాయి. పార్టీల్లో ఒకటే టెన్షన్. అభ్యర్థుల్లో ఆందోళన. ఎందుకంటే ఎన్నికల సమయంలో వరుస సెలవులు రావటమే కారణం.

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతున్నాయి. పార్టీల్లో ఒకటే టెన్షన్. అభ్యర్థుల్లో ఆందోళన. ఎందుకంటే ఎన్నికల సమయంలో వరుస సెలవులు రావటమే కారణం.
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతున్నాయి. పార్టీల్లో ఒకటే టెన్షన్. అభ్యర్థుల్లో ఆందోళన. ఎందుకంటే ఎన్నికల సమయంలో వరుస సెలవులు రావటమే కారణం. పోలింగ్ రోజున ప్రభుత్వం హాలిడే ప్రకటించింది. వరస సెలవులు ఎలా వచ్చాయో చూద్దాం..
– ఏప్రిల్ 11వ తేదీ గురువారం పోలింగ్. ఆ రోజు అందరికీ హాలిడే.
– 12వ తేదీ శుక్రవారం వర్కింగ్ డే. (ఆరోజు అందరూ లీవ్ పెడుతున్నారు)
– 13వ తేదీ రెండో శనివారం
– 14వ తేదీ ఆదివారం సెలవు.
12వ తేదీ ఒక్క రోజు సెలవు పెడితే.. వరసగా నాలుగు రోజులు కలిసి వస్తాయి. దీంతో చాలా మంది ఓటు కంటే.. టూర్ బెటర్ అనే ఓపీనియన్ కి వచ్చారు. ఐటీ, ఇతర సర్వీస్ సెక్టార్ లో పని చేసే ఎంప్లాయిస్ అయితే.. స్మాల్ సమ్మర్ వెకేషన్ ప్లాన్ అంటున్నారు. ఓటు వేయటం కంటే.. ఫ్యామిలీతో ట్రిప్ కోసం వెయిట్ చేస్తున్నారు.
Read Also : పారిపోలేదు : నేను ఇంట్లోనే ఉన్నానని మోహన్ బాబు క్లారిటీ
ఇదే విషయం అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ సిటీలో అయితే మామూలుగా 50శాతం పోలింగ్ దాటదు. అలాంటిది లాంగ్ వీకెండ్ వచ్చింది అంటే.. ఖాళీగా ఉంటారా. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు. మీరు టూర్‌లకు..ఎక్కడైనా వెళ్లండి..ముందు మాత్రం ‘ఓటు’ వేసి వెళ్లాలంటూ అభ్యర్థులు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఓటు హక్కు..అందరూ ఈ హక్కును వినియోగించుకోవాలని ఈసీ ప్రచారం చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో 2018, డిసెంబర్ 07న అసెంబ్లీ పోలింగ్ జరిగింది. 8వ తేదీ రెండో శనివారం, 09వ తేదీ ఆదివారం. వరసగా మూడు రోజులు హాలీడేస్ వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 73.20 శాతం పోలింగ్ నమోదయితే హైదరాబాద్‌లో కేవలం 50 శాతం దాటలేదు. సగం మంది ఓటర్లు ఓటుకు దూరంగా ఉన్నారు. ఇదే పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ అయ్యే అవకాశం ఉందని భయపడుతున్నారు అభ్యర్థులు, ఈసీ. ఏప్రిల్ 11న ఓటు హక్కు వినియోగించుకోండి..ఓటు వేయకుండా వెళ్లొద్దంటూ వేడుకుంటున్నారు. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వెయిట్ అండ్ సీ…
Read Also : డేటా ఆఫర్లు అదుర్స్ : ఏప్రిల్ 4 నుంచి జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్