పంచాయతీ సమరం : పోలింగ్ ప్రారంభం

  • Published By: madhu ,Published On : January 21, 2019 / 01:20 AM IST
పంచాయతీ సమరం : పోలింగ్ ప్రారంభం

3,701 పంచాయతీల్లో నేడు తొలివిడుత పోలింగ్
మధ్యాహ్నం ఒంటిగంటవరకే ఓటింగ్ 
ఆ తర్వాత ఓట్ల లెక్కింపు.
ఉపసర్పంచ్ ఎన్నిక కూడా ఏర్పాట్లు పూర్తిచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

హైదరాబాద్ : పల్లెల్లో ఓట్ల పండుగ వచ్చేసింది. జనవరి 21వ తేదీ తొలి విడుత ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటుతో తమ గ్రామ మొదటి పౌరున్ని ఎన్నుకోనున్నారు. 3,701 గ్రామాల్లో ఎన్నికలు  జరుగుతున్నాయి. మొత్తం 12,202 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 28,976 వార్డులకు 70,094 మంది పోటీ పడుతున్నారు.
7 గంటల నుండే పోలింగ్..
సోమవారం ఉదయం 7 గంటల నుండే పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ముందుగా వార్డు స్థానాలు లెక్కించి సర్పంచ్‌ స్థానాల ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు పూర్తయిన తరువాత ఉప సర్పంచ్ ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. చేతులెత్తే పద్ధతిలోనే ఈసారి కూడా ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. 
ఇక ఎన్నికల నిర్వాహణ కోసం 1,48,033 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. 26 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సిబ్బంది వారి వారికి కేటాయించిన ప్రాంతాలకు సామాగ్రీతో తరలివెళ్లారు. పంచాయతీ ఎన్నికల్లో ఇంక్‌ను ఎడమచేయి మధ్య వేలుకు పెట్టాలని ఆదేశాలిచ్చారు.