తెలంగాణలో కొరియన్ క్లస్టర్ : మంత్రి కేటీఆర్‌

  • Published By: veegamteam ,Published On : September 26, 2019 / 05:22 AM IST
తెలంగాణలో కొరియన్ క్లస్టర్ : మంత్రి కేటీఆర్‌

Updated On : September 26, 2019 / 5:22 AM IST

భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే దక్షిణ కొరియా పరిశ్రమల కోసం ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ప్రపంచంలోని ప్రముఖ సంస్థలన్నీ హైదరాబాద్‌కు తరలివచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఐటీ రంగంలో టాప్ 5 కంపెనీలు కార్యాలయాలు ఏర్పాటు చేశాయి. తాజాగా దక్షిణ కొరియా వ్యాపార దిగ్గజాలు తెలంగాణకు తరలివచ్చాయి.

48 మందితో కొరియన్‌ బృందం రాష్ట్ర పర్యటనకు వచ్చింది. మంగళవారం (సెప్టెంబర్ 24, 2019) కేటీఆర్‌‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొరియన్‌ పరిశ్రమల క్లస్టర్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు. కొరియా పరిశ్రమలకు అన్ని విధాల సహకారం అందిస్తామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను కొరియన్ ప్రతినిధులకు వివరించారు మంత్రి కేటీఆర్. 

ప్రత్యేకంగా కొరియా క్లస్టర్ ఏర్పాటుకు కొరియా ఇంటర్నేషనల్ ట్రేడ్ అసోషియేషన్ – కీటా, కొరియా ట్రేడ్ ఇన్వేస్ట్మెంట్ ప్రొమోషన్ ఎజెన్సీ – కొట్రా వంటి సంస్ధలతో కలిసి పనిచేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Read More : ప్రభుత్వ స్కూళ్లలో Google ల్యాబ్స్!