Weather Report : సూర్యుడి భగభగలు 

  • Published By: madhu ,Published On : March 27, 2019 / 12:26 AM IST
Weather Report : సూర్యుడి భగభగలు 

Updated On : March 27, 2019 / 12:26 AM IST

తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగలతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్చి 26వ తేదీ మంగళవారం పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం, నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం లక్ష్మాపూర్‌లలో గరిష్టంగా 40.8 డిగ్రీల అత్యధిక టెంపరేచర్స్ రికార్డయ్యాయి.  కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సర్వాపూర్, మద్నూరు మండలం సోంపూర్, ఆదిలాబాద్ జిల్లా బేల, జగిత్యాల ధర్మపురం మండలం నేరెళ్ల, నిర్మల్ జిల్లా భైంసా మండలంలో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.