వైసీపీలో జయసుధ : జగన్ సీఎం కావడం ఖాయం

  • Published By: madhu ,Published On : March 7, 2019 / 11:30 AM IST
వైసీపీలో జయసుధ : జగన్ సీఎం కావడం ఖాయం

Updated On : March 7, 2019 / 11:30 AM IST

టాలీవుడ్‌లో సహజ నటిగా పేరొందిన జయసుధ పార్టీ మార్చేశారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్ పాండులో జగన్‌ను మార్చి 07వ తేదీ గురువారం ఆమె కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో జయసుధ మాట్లాడారు. జగన్ సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్న జయసుధ సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. 
Also Read : కారణం ఇదేనా?: టీడీపీ వెబ్ సైట్ కు ఏమైంది?

సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారు..ఆ రోజుల్లో చాలా కన్ఫ్యూజ్‌గా ఉండేది..చివరకు కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. తనకు సినిమా తప్ప వ్యాపారం లేదన్నారు. టీడీపీలో చేరిన సమయంలో తాను యాక్టివ్‌గా ఉండకపోవడం ఆ పార్టీయే కారణమని కామెంట్స్ చేశారు. గతంలో వైఎస్ ఎలా చెబితే అలా నడుచుకున్నట్లు..ఇప్పుడు కూడా జగన్ ఎలా చెబితే అలానేనని తెలిపారు. ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదన్నారు. సినిమా వాళ్లు జగన్‌ని ఎందుకు కలవొద్దని..ఇలా అనడం తప్పుగా భావిస్తున్నట్లు పరోక్షంగా బాబునుద్దేశించి జయసుధ వ్యాఖ్యానించారు. 

ఉమ్మడి ఏపీలో జయసుధ 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు.
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత 2016లో జయసుధ TDPలో చేరారు. ఆనాడు బాబుపై ప్రశంసల జల్లు కురిపించారు.
అయితే టీడీపీ పార్టీలో అంత యాక్టివ్‌గా పాల్గొనలేదు జయసుధ.
ప్రస్తుతం వైసీపీలో చేరడంతో జయసుధ ఇక ఏపీ రాజకీయాలకు పరిమితమౌతారా? లేదా ? ఇతరత్రా వివరాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి. 
Also Read : ఫస్ట్ టైం : రూ.20 కాయిన్ వచ్చేస్తోంది