రియల్ హీరో : రోడ్డు యాక్సిడెంట్ బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లిన సాయి ధరమ్ తేజ్

  • Published By: venkaiahnaidu ,Published On : September 4, 2019 / 04:04 PM IST
రియల్ హీరో : రోడ్డు యాక్సిడెంట్ బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లిన సాయి ధరమ్ తేజ్

Updated On : September 4, 2019 / 4:04 PM IST

రీల్ లైఫ్ లో మాత్రమే కాదు రియల్ లైఫ్ కూడా మానవత్వం ఉందని మరోసారి సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ లతన మానవత్వాన్ని చూటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. హైదరాబాద్ నానక్‌రాం గూడ నుంచి షూటింగ్ పూర్తి చేసుకుని కారులో వెళ్తున్న సాయి ధరమ్ తేజ్‌కు.. మార్గమధ్యంలో జూబ్లిహిల్స్ లో ఓ రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలిసి అతడిని తన కారులో హాస్పిటల్ కు తీసుకెళ్లాడు.

జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 42 లో బైక్‌పై ఓవర్‌ స్పీడ్‌ గా వెళ్తున్న వ్యక్తికి ఎదురుగా కారు అడ్డు రావడంతో బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో బైక్ కింద పడిపోగా బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అక్కడికి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్‌… గాయపడ్డ వ్యక్తిని తానే స్వయంగా ఎత్తుకుని తన కారులో ఎక్కించాడు. వెంటనే అతడిని తన కారులో సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించాడు. గాయపడిన వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు అని సమాచారం.