టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సీఎం కేసీఆర్
ఉత్కంఠ వీడింది. రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యయి. కే.కేశవరావు, దామోదర్ రావు పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న

ఉత్కంఠ వీడింది. రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యయి. కే.కేశవరావు, దామోదర్ రావు పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న
ఉత్కంఠ వీడింది. ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్ ట్విస్ట్ ఇచ్చారు. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. కే.కేశవరావు, కేఆర్ సురేష్ రెడ్డి పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న కే.కేశవరావుకు మరోసారి అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేశవరావుకి రాజ్యసభ ఇవ్వాలని ముందే నిర్ణయించగా, రెండో సీటుపై చివరి నిమిషం వరకు సస్పెన్స్ నడిచింది. సీఎం కేసీఆర్ సన్నిహితుడు దామోదర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సురేష్ రెడ్డి మధ్య చివరి వరకు పోటీ నడిచింది. చివరకు సురేష్ రెడ్డి వైపే కేసీఆర్ మొగ్గు చూపారు.
రెండో సీటుపై ఆఖరి వరకు సస్పెన్స్:
తెలంగాణలో ఖాళీ అయిన 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 13 చివరి తేదీ. దీంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ అభ్యర్థులు కేకే, సురేష్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నడిచింది. రోజుకో పేరు తెరపైకి వస్తుండంతో ఆశావహుల్లో టెన్షన్ పెరిగింది. సీఎం కేసీఆర్ మనసులో ఏముంది..? ఎవరెవరి పేర్లను ఫైనల్ చేయబోతున్నారనే అంశం ఉత్కంఠ రేపింది. చివరకు సీఎం కేసీఆర్.. కేకే, సురేష్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు.
పోటీపడిన దామోదర్, పొంగులేటి, పార్థసారథి:
టీఆర్‌ఎస్ నుంచి పెద్దల సభకు వెళ్లాలని అనుకున్న ఆశావహుల లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహా అదే జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త పార్ధసారధి రెడ్డి పేర్లు బలంగా వినిపించాయి. అలాగే టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు పేరు కూడా పరిశీలనలో ఉందని వార్తలు వచ్చాయి. మరోవైపు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరొందిన దామోదర్ రావుకు కూడా అవకాశాలను కొట్టిపారేయలేమని పార్టీ వర్గాలు అన్నాయి. చివరకు సురేష్ రెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు చూపారు. సురేష్ రెడ్డి గతంలో అసెంబ్లీ స్పీకర్ గా పని చేశారు.
ఎమ్మెల్సీగా కవితకు ఛాన్స్:
ఎవరి ఊహలకు అందని విధంగా అనేక ట్విస్టుల తర్వాత సీఎం కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు. రాజ్యసభ అభ్యర్థుల రేసులో సురేష్ రెడ్డి పేరు అస్సలు వినిపించ లేదు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురేష్ రెడ్డిని ప్రకటిస్తారని మొదటి నుంచి అనుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం అదే విషయాన్ని చెప్పారు. అనుకోకుండా సీఎం కేసీఆర్ ట్విస్ట్ ఇచ్చారు. సురేష్ రెడ్డిని కొత్తగా రాజ్యసభకు పంపిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. సురేష్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడంతో ఇప్పుడు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ అవకాశాన్ని మాజీ ఎంపీ, కేసీఆర్ కూతురు కవితకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. కవిత నిజామాబాద్ ఎంపీగా పని చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ ఎమ్మెల్సీ సీటుని అరికెల నర్సారెడ్డి కూడా ఆశిస్తున్నారు.
తనకు రాజ్యసభ టికెట్ ఖాయమని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చివరి నిమిషం వరకు నమ్మకంగా ఉన్నారు. నిత్యం కేసీఆర్, కేటీఆర్ లను ఆయన కలిసి వెళ్లారు. హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయనను రాజ్యసభకు పంపిస్తారని వార్తలు వచ్చాయి. ఇక సీఎం కేసీఆర్ సన్నిహితుడు, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు పేరు కూడా రాజ్యసభ అభ్యర్థి రేసులో వినిపించింది.