ముగ్గురు సిట్టింగ్‌‌లకు నో ఛాన్స్ : టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరే

హైదరాబాద్: అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. ఊహించినట్టుగానే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. వారికి

  • Published By: veegamteam ,Published On : March 21, 2019 / 11:09 AM IST
ముగ్గురు సిట్టింగ్‌‌లకు నో ఛాన్స్ : టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరే

Updated On : March 21, 2019 / 11:09 AM IST

హైదరాబాద్: అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. ఊహించినట్టుగానే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. వారికి

హైదరాబాద్: అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా ఫైనల్ అయ్యింది. ఊహించినట్టుగానే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. వారికి రెండోసారి టికెట్ ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించలేదని ఎమ్మెల్యేల ఫిర్యాదుతో ఖమ్మం(పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి), మహబూబ్ నగర్(జితేందర్ రెడ్డి), మహబూబాబాద్(సీతారాం నాయక్) సిట్టింగ్ ఎంపీలకు అవకాశం ఇవ్వలేదు. లోక్ సభ బరిలో నలుగురు కొత్త ముఖాలకు అవకాశం కల్పించారు. 7 మంది సిట్టింగ్ లకు మరో ఛాన్స్ ఇచ్చారు. హైదరాబాద్ లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి బరిలోకి దిగనున్నారు.
Read Also : జగన్‌కి ఒక్క ఛాన్స్ ఇస్తే : ప్రశాంతంగా బతకలేరు

* ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు నో ఛాన్స్
* ఏడుగురు సిట్టింగ్ ఎంపీలకు మరో అవకాశం

టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు:
* కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్
* మెదక్ – కొత్త ప్రభాకర్ రెడ్డి
* నిజామాబాద్ – కల్వకుంట్ల కవిత
* జహీరాబాద్ – బీబీ పాటిల్
* ఆదిలాబాద్ – నగేష్
* వరంగల్ – పసునూరి దయాకర్
* భువనగిరి – బూర నర్సయ్యగౌడ్
* నల్లగొండ – వేమిరెడ్డి నర్సింహారెడ్డి
* పెద్దపల్లి – వెంకటేశ్ నేతకాని
* ఖమ్మం – నామా నాగేశ్వరరావు (మాజీ ఎంపీ)
* నాగర్‌కర్నూలు – రాములు (మాజీ మంత్రి)
* మహబూబాబాద్ – మాలోత్ కవిత (మాజీ ఎమ్మెల్యే)
* హైదరాబాద్ – పుస్తె శ్రీకాంత్ రెడ్డి

 

తొలిసారి లోక్ సభ బరిలోకి నాలుగు కొత్త ముఖాలు:
సికింద్రాబాద్ – తలసాని సాయికిరణ్
మహబూబ్ నగర్ – ఎం. శ్రీనివాస్ రెడ్డి
మల్కాజ్ గిరి – రాజశేఖర్ రెడ్డి
చేవెళ్ల – డా. రంజిత్ రెడ్డి
Read Also : ఏపీ ఎన్నికలు 2019 : పూతలపట్టు టీడీపీ అభ్యర్థి ఛేంజ్