కూరగాయలు, నిత్యవసరాలకు రేట్లు ఫిక్స్. ధర పెంచితే పీడీ యాక్ట్ కింద కేసులు

  • Published By: chvmurthy ,Published On : March 25, 2020 / 08:27 AM IST
కూరగాయలు, నిత్యవసరాలకు రేట్లు ఫిక్స్. ధర పెంచితే పీడీ యాక్ట్ కింద కేసులు

Updated On : March 25, 2020 / 8:27 AM IST

ప్రాణాంతకమైన కరోన వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది.  దీంతో జన జీవనం స్తంభించింది. నిత్యావసర వస్తువులకు డిమాండ్ పెరిగింది.  కొన్ని ప్రాంతాల్లో వ్యాపారస్తులు  ధరలు పెంచి  సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూరగాయలు, నిత్యావసరాలకు ధరలను నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా అధికంగా అమ్మితే పీడీ యాక్ట్‌  కింద కేసులు  నమోదుచేయమని అధికారులకు ఆదేశించారు. 

కూరగాయలు 
వంకాయ- కిలో రూ.30, 
బెండకాయ- కిలో రూ.40, 
టమాట- కిలో రూ.10, 
అరటికాయ- కిలో రూ.40, 
కాలిఫ్లవర్‌- కిలో రూ.40. 

 

క్యాబేజి- కిలో రూ.23, 
పచ్చిమిర్చి- కిలో రూ.60, 
చిక్కుడుకాయ- కిలో రూ.45.
బీరకాయ- కిలో రూ.60, 
క్యారెట్‌- కిలో రూ.60, 
ఆలుగడ్డ- కిలో రూ.30, 
ఉల్లిగడ్డ(తెల్లవి)- కిలో రూ.30, 
ఉల్లిగడ్డ(ఎర్రవి)- కిలో రూ.35,
వెల్లుల్లి- కిలో రూ.160, 
అల్లం- కిలో రూ.220

ఆకుకూరలు
పాలకూర- కిలో రూ.40, 
తోటకూర- కిలో రూ.40. 

కొత్తిమీర- కిలో రూ.60, 
మెంతికూర- కిలో రూ.60

పప్పు దినుసులు
కందిపప్పు(గ్రేడ్‌1)- కిలో రూ.95, 
మినపపప్పు- కిలో రూ.140.
పెసరపప్పు- కిలో రూ.105, 
శెనగపప్పు- కిలో రూ.65, 
సజ్జలు- కిలో రూ.30, 
గోధుమలు- కిలో రూ.36, 
జొన్నలు- కిలో రూ.38, 
రాగులు- కిలో రూ.40.

See Also | ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు