విధుల్లో చేరినవారు 1 శాతం కూడా లేరు : అశ్వత్థామ రెడ్డి

సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు లోపు విధుల్లో చేరిన కార్మికులు 1 శాతం కూడా లేరని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి చెప్పారు. కేసీఆర్ కు భయపడి అధికారులు, ప్రజాప్రతినిధులు కార్మికులను కార్లలో తీసుకు వెళ్లి జాయిన్ చేశారని … విధుల్లో చేరిన కార్మికులు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గోంటున్నారని ఆయన తెలిపారు.
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె బుధవారానికి 33వ రోజుకు చేరింది. కేసీఆర్ ప్రకటనలతో కార్మికులెవరూ భయపడవద్దని కోరారు. సీఎం కేసీఆర్ చెపుతున్నట్లు ఆర్టీసిని ప్రయివేటు పరం చేయాలంటే 1950 సెక్షన్ 39బై 1/2 చట్టంకింద ఫ్రభుత్వం ఒక్కటే ఏమీ చేయలేదని అన్నారు.
కేంద్రం తీసుకువచ్చిన మోటారు హవెహికల్ యాక్ట్ ను అమలు చేయం అని గతంలో చెప్పారని, ఒక వేళ అమలు చేయాలంటే అసెంబ్లీని సమావేశ పరిచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ చర్చల ప్రక్రియ ప్రారంభించాలని అశ్వత్థామ రెడ్డి కోరారు.