హైదరాబాద్ వాసులకు నీటి కష్టాలు : ట్యాంకర్లకు డిమాండ్

  • Published By: veegamteam ,Published On : April 14, 2019 / 01:35 PM IST
హైదరాబాద్ వాసులకు నీటి కష్టాలు : ట్యాంకర్లకు డిమాండ్

Updated On : April 14, 2019 / 1:35 PM IST

హైదరాబాదీలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సింగూరు, మంజీరా నుంచి నగరానికి రావల్సిన నీటి సరఫరా నిలిచిపోవడంతో…జలమండలి అందిస్తోన్న ట్యాంకర్లతో పాటు… ప్రైవేటు ట్యాంకర్లపై ప్రజలు ఆధారపడుతున్నారు. దీనివల్ల ప్రైవేట్ ట్యాంకర్లకు డిమాండ్ ఏర్పడటంతో… సందింట్లో సడేమియాలా ప్రైవేట్ ట్యాంకర్ల యాజమానులు ధరలను అమాంతం పెంచేశారు.

గ్రేటర్లో నీళ్ల ట్యాంకర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. మంజీరా, సింగూరు జలాశయాల నుండి   జలమండలి అధకారులు నిత్యం 120 మిలియన్ల గ్యాలన్ల నీళ్లను అందించేవారు. ఈ రెండు జలాశయాల నుంచి పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోవడంతో  నీళ్ల కొరత వేధిస్తోంది. దీంతో నీళ్ల కోసం జలమండలికి చేసే ఫోన్లు చేసే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది.  సాధారణంగా ట్యాంకర్ బుక్ చేసుకున్న 24 గంటల్లో నీటిని సరఫరా చేయాలి. కానీ చాలా ప్రాంతాల్లో డిమాండ్ ఉండటంతో 72గంటలు దాటినా వాటర్ ట్యాంకర్లు రాకపోవడంతో వేరే దారి లేక ప్రైవేట్ ట్యాంకర్లపై ప్రజలు ఆధారపడుతున్నారు.
Read Also : గాల్లో ఉద్యోగాలు : 20 వేల మంది ఉద్యోగులను ఆదుకోండి

జలమండలి అందించే 5వేల లీటర్లతో ట్యాంకర్ 7వందల రూపాయలకు విక్రయిస్తుంటే.. ప్రైవేట్ ట్యాంకర్లు మాత్రం వెయ్యి రూపాయల నుంచి 15వందల వరకూ విక్రయిస్తున్నారు. ధర ఎక్కువగా ఉన్నా అవసరం కోసం కొంటున్న నగరవాసులకు…  అసలు ప్రైవేట్ ట్యాంకర్లు అందించే నీళ్లు ఎంత వరకూ సేఫ్‌ అనే మరో అనుమానం వేధిస్తోంది.  సిటీలో చెరువులు, నాలాల వెంబడి బోర్లు వేసి నీటి వ్యాపారం సాగించడంతో జలమండిలి సరఫరా చేసిన నీటికి… ఈ నీటికీ చాలా  తేడాలుంటున్నాయని వాపోతున్నారు. 

దీనిపై వరుస ఫిర్యాదులు అందడంతో వాటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. వాటర్ బోర్డు నీటిని సరఫరా చేసేందుకు ప్రైవేట్ ట్యాంకర్లను అనుసంధానం చేస్తున్నామని… సిటీ పరిధిలో ఉన్న అన్ని వాటర్ ట్యాంకర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వాటర్ బోర్డు అధికారులు అంటున్నారు. వాటర్ ట్యాంకర్ల సంఖ్యను పెంచడంతో పాటు వాటర్ ట్యాంకర్ల పనివేళలు పెంచుతామని అధికారులు చెబుతున్నారు. సాధ్యమయినంత త్వరగా నీటి కష్టాల నుంచి గట్టెక్కించాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులపై  తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Also : సల్మాన్, అమీర్ ఖాన్ ఏకం అవ్వాలి, ఎన్నికలు రద్దు చెయ్యాలి : పాల్ డిమాండ్