ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే ఏమిటి? ఎన్ని రోజుల్లో తీర్పు వస్తుంది?

దిశ హత్య కేసు దర్యాప్తు మరింత వేగం కానుంది. దిశ హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్‌ట్రాక్

  • Published By: veegamteam ,Published On : December 4, 2019 / 12:09 PM IST
ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే ఏమిటి? ఎన్ని రోజుల్లో తీర్పు వస్తుంది?

Updated On : December 4, 2019 / 12:09 PM IST

దిశ హత్య కేసు దర్యాప్తు మరింత వేగం కానుంది. దిశ హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్‌ట్రాక్

దిశ హత్య కేసు దర్యాప్తు మరింత వేగం కానుంది. దిశ హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంతకు ముందు దిశ హత్య కేసులో విచారణను త్వరగా పూర్తి చేయించి.. దోషులకు కఠిన శిక్షలు వేయించేందుకు.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది.

మరోవైపు దిశ హత్య కేసు నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుంది. నిందితులను కస్టడీకి అప్పగిస్తూ షాద్‌ నగర్ కోర్టు ఆదేశాలు ఇవ్వగానే వాళ్లను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. 

ఇంతకీ.. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే ఏమిటి.? అది ఎలా పనిచేస్తుంది..? ఎన్ని రోజుల్లో తీర్పు వస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

* ప్రత్యేకంగా.. ఒక కేసును త్వరితగతిన విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేస్తారు. 
* మిగతా కోర్టుల మాదిరిగానే.. ఈ కోర్టు కూడా న్యాయశాస్త్రానికి లోబడే పనిచేస్తుంది. కాకపోతే.. కొన్ని ప్రత్యేక అధికారాలుంటాయి. 
* కేసుకు సంబంధించి పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశాక కోర్టులో విచారణ మొదలవుతుంది. 
* ప్రతి రోజూ.. దానిపై న్యాయమూర్తి విచారిస్తూ ఉంటారు. 
* పోలీసులు సేకరించిన ఆధారాలను, సాక్ష్యాలను పరిశీలిస్తుంటారు. 
* వీలైనంత త్వరగా.. కేసును అధ్యయనం చేసి.. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించి.. తీర్పు చెబుతారు.
* ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశాక.. కేసుకు సంబంధించి పోలీసులు త్వరితగతిన ఆధారాలు సేకరిస్తారు. ఆ వెంటనే.. కోర్టులో చార్జ్ షీట్ వేస్తారు. 
* ఫాస్ట్ ట్రాక్ కోర్టులో.. కేసుకు సంబంధించి.. రోజువారీ విచారణ జరుగుతుంది. 
* సాక్షులు చెప్పిన విషయాలను, పోలీసులు సమర్పించిన ఆధారాలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుంటారు. 
* సాక్ష్యాధారాలన్నీ పరిశీలించాక.. నిజానిజాలు తేలాక.. దోషులకు కోర్టు శిక్ష విధిస్తుంది.