అద్దె ఇళ్లు కావాలా.. ఏ ఊరు మీది? నాన్‌వెజ్ తింటారా?!

21వ శతాబ్దంలో ఒక అద్దె ఇంటి కోసం వెతకాలంటే ఓ సుదీర్ఘ ప్రయాణంతో సమానం. కచ్చితంగా అద్దె ఇల్లు దొరుకుతుందని గ్యారెంటీ లేదు. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో అద్దె ఇల్లు దొరకాలంటే పెద్ద కష్టమేమి కాదమే అనిపించేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. అది దొరికినా అద్దె చెల్లించలేనంతగా రేట్లు చెప్పేస్తుంటారు. అద్దె కోసం వచ్చేవారిని అడిగే ఇంటి యజమానుల్లో అసలు ఉద్దేశం ఒకటి అయితే బయటకు మరోలా అడుగుతుంటారు.. మీరు శాఖాహారియేనా అని ఎందుకిలా వారు అడుగుతారో తెలియాలంటే మీరోసారి ఖైరతాబాద్ చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు వెళ్లి రావాల్సిందే. అక్కడికి వెళ్లి ఓసారి అద్దె ఇల్లు కోసం ప్రయత్నిస్తే అసలు విషయం మీకే బోధపడుతుంది..
ఖైరతాబాద్ చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు, ముఖ్యంగా ఆనంద్ నగర్ కాలనీకి ఓసారి వెళ్తే మీకే తెలుస్తుంది.. మీరు బ్రాహ్మణులు కాకపోతే చాలా మంది ఇంటి యజమానులు మీకు అద్దెకు ఇవ్వడానికి నిరాకరిస్తారు. దానికి మిమ్మల్ని నేరుగా అలా అడగరు.. శాఖాహారులు మాత్రమే అని సాకుతో అడిగి తెలుసుకుంటారు. దీనికి తోడు.. ప్రాంతీయ పక్షపాతం కూడా ఒకటి.. ఆంధ్ర ప్రజలకు మాత్రమే.. మరికొంతమంది అయితే ఎలాంటి మెహమాటం లేకుండా సూటిగా అడిగేస్తుంటారు..
ఈ కండీషన్ కామన్ :
తాము ఆంధ్ర నుండి వచ్చిన వ్యక్తులకు మాత్రమే ఇల్లు అద్దెకు ఇస్తామని.. అది కూడా శాఖాహారులు అయితేనే ఒక కండీషన్ పెడతారు. నగరం నడిబొడ్డున ఉన్న ఖైర్‌తాబాద్‌లోని ఆనంద్ నగర్ కాలనీ చుట్టూ ఇల్లు అద్దె కోసం వెళ్లేవారికి ఎదురయ్యే వింత అనుభవం. రవి కుమార్ అనే ప్రైవేటు రంగ ఉద్యోగి, అద్దెకోసం వెళ్లినప్పుడు.. అక్కడ ఆంధ్ర నుండి వచ్చిన వారికి మాత్రమే అని బహిరంగంగా చెప్పడంతో విస్మయానికి గురయ్యాడు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కుమార్ కుమార్ మాట్లాడుతూ.. బంజారా హిల్స్‌లో ఉన్న తన ఆఫీసుకు దగ్గరగా ఒక ఇల్లు కావాలని అద్దెకోసం వెతికాడు. ఖైర్‌తాబాద్ సరైన ప్రాంతం కావడంతో అక్కడే అద్దెకు ఇల్లు తీసుకోవాలని అనుకున్నాడు. టు-లెట్ బోర్డు కనిపించిన కొన్ని ఇంటి యజమానులను సంప్రదించిన ఆయనకు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన వారికి మాత్రమే ఇస్తారని తెలిసి షాక్ అయ్యారు. ఎందుకంటే తెలుగు మాట్లాడే వ్యక్తికి ఎందుకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారో అర్థం చేసుకోవడం కష్టమనే చెప్పాలి. ఈ ప్రాంతంలో, చాలా చిన్న సందులలో ‘టు-లెట్’ బోర్డులు దర్శనమిస్తాయి.
కులం.. ప్రాంతం అడగడంతో షాకయ్యా..
కానీ, ఇల్లు అద్దెను అడిగే సందర్భంలో మాత్రం ఇంటి యజమానులు తమ ఇళ్లను అద్దెకు ఇవ్వమంటూ త్వరగా చెప్పేస్తారు. ఎందుకు అద్దెకు ఇవ్వరు అనేది మాత్రం చాలా సందర్భాలలో ఉండదు. వారు చెప్పరు. పి. మీనాక్షి (పేరు మార్చాం).. ఆమె తన ఉమ్మడి కుటుంబానికి వసతి కోసం అద్దె ఇల్లు చూస్తున్నాను.. ఈ క్రమంలో ఓ ఇంటి యజమాని ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతానికి చెందినవారంటూ ప్రశ్నించారు. తన కులం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ శతాబ్ద కాలంలో హైదరాబాద్‌లో ఇలా ఒకరు అడగడం చాలా షాకింగ్ గురిచేసిందని ఆమె వాపోయారు. ఖైర్‌తాబాద్‌లోని మరో సందులో కూడా ఇంటి యజమానులు తమ ఇళ్లను ఆంధ్ర బ్రాహ్మణులకు మాత్రమే ఇస్తామని చెప్పడంతో మీనాక్షి నివ్వేరపోయారు.
ఎవరిపైనా మాకు పక్షపాతం లేదు :
శ్రీరామ్ ఆర్, ఇంటి యజమాని (పేరు మార్చాం) ‘మతం లేదా కులం ఏదైనాసరే ఎవరిపైనా మాకు పక్షపాతం లేదు. సాధారణ పూజల మాదిరిగా మన శ్రేయస్సుకి మంచిదని మేము నమ్ముతున్న ఆచారాలు ఉన్నాయి. ఆ కారణంగా, యజమానులు ఎవరిని అద్దెకు తీసుకోవాలో ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇది వ్యక్తిగత ఎంపిక మాత్రమే.. అనవసరంగా పక్షపాతం లేదా రంగు-దృష్టి అని తప్పుగా సూచించకూడదు’ అని చెప్పకొచ్చాడు. ప్రస్తుతం సైనిక్‌పురిలో అద్దెకు ఉండే టోనీ మెటల్‌హెడ్ అనే వ్యక్తి కొత్త ఇల్లు కోసం వెతుకుతున్నాడు,
‘నేను ఉత్తర ప్రాంతం నుంచి వచ్చాను. నా భార్య ఈశాన్య ప్రాంతానికి చెందినది. నా భార్యను నేను ఆమె తినే అన్ని రకాల ప్రశ్నలను అడగడంతో మా ఇద్దరికీ ఇల్లు దొరకడం చాలా కష్టంగా మారింది. ఇంటి యజమానులు మమ్మల్ని ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు తిరస్కరించారు. కానీ చాలా మర్యాదగానే అద్దెకు ఇల్లు ఇవ్వమని చెప్పారు’ అని తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు.
రామరాజు అనే టెక్కీ మాట్లాడుతూ.. ‘నేను హిమయత్ నగర్ లో చాలా మార్పును చూశాను. ఇక్కడ ఆంధ్ర నుండి చాలా మంది ఇళ్ళు కొన్నారు. ఇంతకుముందు మంచి వ్యక్తుల కలయిక ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. మతం, ప్రాంతం కులం గురించి ప్రజలు ఎక్కువగా ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. ఇది రోజురోజుకీ కాలం మారుతున్న ధోరణిగా చెప్పవచ్చు.