14 వరకు మద్యం షాపులు బంద్

  • Published By: chvmurthy ,Published On : April 1, 2020 / 05:04 AM IST
14  వరకు మద్యం షాపులు బంద్

Updated On : April 1, 2020 / 5:04 AM IST

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ అమలవుతూ ప్రజా జీవనం స్తంభించి పోతే …తెలంగాణాలో రోజుకు రెండు గంటలు మద్యం షాపులు తెరుస్తారనే ఫేక్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వార్తకు అలర్టైన ఎక్సైజ్ శాఖ …తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 14 వరకు అన్ని మద్యం దుకాణాలను మూసి ఉంచాలని  ఆదేశాలు జారీ చేసింది. (హైదరాబాద్ లో అల్లర్లకు కుట్ర : ఇద్దరి అరెస్ట్)

ఈ మేరకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మంగళవారం మార్చి31న ఉత్తర్వులు జారీ చేశారు. 14 వరకు రాష్ట్రంలోని అన్ని వైన్‌షాపులు, బార్లు మూసి ఉంచాలని, ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వాస్తవానికి, గతంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విధంగా మద్యం దుకాణాల మూసివేత గడువు మార్చి31, మంగళవారంతో ముగిసింది.  ఈ  సమయంలో మళ్లీ మద్యం దుకాణాలు తెరుస్తారని, అమ్మకాలకు కొంత వెసులుబాటు కల్పిస్తున్నారని  సోషల్ మీడియాలో  ప్రచారం జరిగింది.  

రోజుకు రెండుగంటలు మద్యం షాపులు తెరుస్తారని ఫేక్ న్యూస్ వైరల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.  ఆ వార్త చూసి వైన్ షాపుల ముందు బారులు తీరిన జనాలను చూసి అధికారులు అలెర్టయ్యారు. ఫేక్ న్యూస్ వార్తలకు తెరదించుతూ ఈనెల 14 వరకు రాష్ట్రంలోని అన్ని మద్యం కాణాలను మూసే ఉంచాలని  ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.