ఉమెన్స్ డే : 10టీవీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ రచనకు అవార్డ్ 

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 07:39 AM IST
ఉమెన్స్ డే : 10టీవీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ రచనకు అవార్డ్ 

Updated On : March 9, 2019 / 7:39 AM IST

హైదరాబాద్ : మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిభ కనబరిచిన మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రధానం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 21మంది మహిళలను ప్రభుత్వం సత్కరించింది. వీరిలో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో  10టీవీ సబ్ ఎడిటర్ రచనా అవార్డును దక్కించుకున్నారు. గత 15 ఏళ్లగా హెల్త్ విభాగంలో జర్నలిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న రచనా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డును దక్కించుకున్నారు. 

పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించి అంశాలపై 300ల పేజీల పుస్తకాన్ని రచించారు రచన. కాగా క్రీడా విభాగంలో ప్రముఖ క్రికెటర్ మిథాలీరాజ్ ఈ పురస్కారాన్ని పొందారు.